చెత్త తీసే కొద్దీ నోట్ల కట్టలు.. కాకపోతే..?!

అక్కడ పనిచేసే పంచాయతీ కార్మికులు ప్రతిరోజు లాగానే సోమవారం రోజు ఉదయం కూడా తమకు కేటాయించిన పనిలో నిమగ్నమయ్యారు.పని చేసుకుంటున్న సమయంలో ఉన్నటుండి డబ్బు కట్టలు బయట పడ్డాయి.100 కాదు 200 కాదు ఏకంగా 500, 2000 రుపాయిల కాగితాలే.అవి చుసిన సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

 Bundles Of Banknotes As Garbage Is Removed But They Are From Kids Bank, Panchay-TeluguStop.com

తీరా చూస్తే ఆ నోట్లు ఏంటా అని ఆరా తీస్తే.దిమ్మతిరిగిపోయే నిజం బయట పడింది.

అది తెలిసి అక్కడ సిబ్బందికి నవ్వాలా లేక ఏడవాలా అనేది అర్ధం కాలేదట.అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది.

ఇంతకీ ఆ డబ్బు కట్టల రహస్యం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి రూరల్ పంచాయతీలోని ఉండవల్లి సెంటర్‌లో ఎస్‌బీఐ సమీపంలో చెత్తను తొలగిస్తున్నారు.ఇంతలో కార్మికులకు ఒక రూ.500నోటు కనిపించింది.అది చూసిన కార్మికులు భలే మంచి రోజు అనుకుని దానిని తీసి జేబులో పెట్టుకున్నాడు.కానీ.మళ్ళీ అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్న కొద్ది డబ్బు నోట్లు బయటకు వస్తూనే ఉన్నాయి.ఆ డబ్బులు చూసి కార్మికులు షాక్ అయ్యారు.

ఇంకా ఉన్నాయేమో అని మొత్తం అక్కడ ఉన్న చెత్తను ఏరుతున్నారు.అక్కడ చెత్త అంతా తీసేసరికి సుమారు 30 కట్టల నోట్లు కనిపించాయి.అందులో రూ.500, రూ.200, రూ.2వేల రూపాయలు ఉన్నాయి.అంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కనిపించేసరికి ఆందోళన చెందిన పంచాయతీ సిబ్బంది వెంటనే ఆ గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు.వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది ఆ నోట్లను పరిశీలించారు.

ఇవేమన్న దొంగ నోట్ల అనుకుని పరిశీలనగా చూసారు.కానీ.

, అవి దొంగ నోట్లు కాదు.ఇంకాస్త క్షుణ్ణంగా పరిశీలించిన పిదప వాళ్ళకి ఒక్క విషయం అర్ధం అయింది.

ఆ నోట్ల మీద ‘చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’, ‘ఫర్‌ స్కూల్‌ జోన్‌ ఓన్లీ’ అని రాసి ఉండడాన్ని వాళ్ళు గమనించారు.దింతో అది చదివిన వారు అందరు కొంత సేపు నువ్వుకున్నారు.

మళ్లీ ఆ నోట్ల కట్టలను తిరిగి చెత్తలో పడేసి డంపింగ్ యార్డకు తరలించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube