షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన బాలకృష్ణ.. ఈ లుక్ BB3 కోసమేనా..!

నందమూరి అభిమానులు బాలయ్య సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.

 షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన -TeluguStop.com

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే పెద్ద అంచనాలే ఉన్నాయి.ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు చేయబోయే సినిమా కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సినిమాను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినా ఇంకా సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Telugu Balakrishna, Balakrishna Bb, Bb, Bb Sets, Boyapati Srinu, Holi, Pragya Ja

ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన టీజర్ లో ఒక లుక్ రివీల్ అయ్యింది.బాలయ్య ఈ సినిమాలో అఘోర పాత్రలో నటించబోతున్నాడని ఎప్పటి నుండో టాక్ వస్తుంది.అయితే తాజాగా BB3 సెట్ లో హొలీ జరుపుకున్న సందర్భంగా బాలకృష్ణ లుక్ బయటకు వచ్చింది.

అది BB3 లో మరొక పాత్రకు సంబంధించిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బోయపాటి బాలయ్యను డిఫెరెంట్ అఘోర ను చూపించబోతున్నాడని టాక్.

ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది.బాలకృష్ణ ఈ ఫొటోలో నెరిసిన పెద్ద గడ్డంతో డిఫెరెంట్ గా కనిపించాడు.

మరి ఈ లుక్ BB3 సినిమాలోనిదో కాదో తెలియాలంటే అధికారికంగా లుక్ రివీల్ చేసే వరకు ఆగాల్సిందే.ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు బోయపాటి ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube