పవర్ స్టార్ తో అదిరిపోయే స్టంట్ చేయించిన క్రిష్..!

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున వీలైనన్ని సినిమాలు చేయాలనీ పవన్ అనుకుంటున్నాడు.

 Krish Canning High Octane Action Sequences Featuring Power Star Pawan Kalyan, Pa-TeluguStop.com

అందుకే ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ మళ్ళీ వెండితెర మీద కనిపించబోతున్నాడు.అందుకే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

అంజలి, నివేతా థామస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే పవన్ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.‘హరిహర వీరమల్లు‘ అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఉంటాయని సమాచారం.

అయితే ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్స్ తెరకెక్కించడానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ కౌశల్ ను తీసుకున్నారట.తాజాగా ఈయన ఆధ్వర్యంలో క్రిష్ పవర్ స్టార్ తో అదిరిపోయే స్టంట్ చేయించాడని తెలుస్తుంది.

ఈ విషయం గురించి కౌశల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.క్రిష్ 3, ధూమ్ 3 వంటి యాక్షన్ సినిమాలకు పనిచేసిన కౌశల్ పవర్ స్టార్ తో ఎలాంటి స్టంట్ చేయించాడో చూడాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

 ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube