పెళ్ళిలో ఈ లొల్లేంది ట్రంపూ....మరో సారి నవ్వుల పాలైన ట్రంప్...!!!

అమెరికాలో ఫ్లొరిడా లో ఉన్న ప్రఖ్యాత మార్ ఏ లాగో రిసార్ట్ లో పెళ్లి వేడుక జరుగుతోంది.జాన్ అరిగో, మేగన్ నాడారర్ అనే దంపతులు పెళ్లి చేసుకుంటున్నారు.

 Donald Trump Speech At Mar A Lago Wedding, Mar A Lago Wedding, Donald Trump, Joe-TeluguStop.com

ట్రంప్ కు బిజినెస్ పార్టనర్ అయిన జాన్ అరిగో ప్రముఖులను ఆహ్వానించాడు.ఎంతో కాస్ల్టీ పెళ్లి అది, అంగరంగ వైభవంగా జరుగుతోంది.

వధువు వరులు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, పెళ్లి పెద్దలు అందరూ కోలాహలంగా ఉన్న పెళ్లిని చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక్క సారిగా తళుక్కున మెరిశాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

భారీ స్క్రీన్ లపై ప్రత్యక్షమైన ట్రంప్ తన గురించి డబ్బాలు కొట్టుకోవడం మొదలు పెట్టాడు.

భారీ స్క్రీన్ పై ట్రంప్ ను చూసిన వారందరూ షాక్ అయ్యారు.

ట్రంప్ మాట్లాడుతూ నన్ను గుర్తు పట్టారా నేను మీ మాజీ అధ్యక్షుడిని అంటూ కుళ్ళు జోకులు వేయడం మొదలు పెట్టాడు.అక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రంప్ కొడుతున్న వీర సుత్తి కి తలలు పట్టుకుంటున్నారు.

అయినా ఎవరిని ట్రంప్ వదల్లేదు.ఎవరూ కదలకండి మీకు నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానని తెలిపాడు.

ఏంటా అని ఆసక్తిగా వింటున్న ఆహుతులకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వివరిస్తున్నాడు.

Telugu China, Donald Trump, Donaldtrump, Iran, Joe Biden, Mar Lago-Telugu NRI

చైనా , ఇరాన్ లపై బిడెన్ ప్రేమను చూపుతున్నాడని, ప్రస్తుతం అధ్యక్షుడు తీరు అసలు బాలేదని విమర్శలు గుప్పించారు.చైనా ఇరాన్ లతో బిడెన్ డీల్ కుదుర్చుకున్నారని, ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నారని ఆరోపించారు.తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని ట్రంప్ తెలిపారు.

సరిహద్దుల విషయంలో బిడెన్ నిర్ణయాలు అస్సలు బాలేదని, అక్రమ వలసలపై బిడెన్ చూసి చూడనట్టు వ్య్వహరిస్తున్నారని విమర్శలు చేశారు.ట్రంప్ మాటలు వింటున్న పెళ్లి వారు ఇదెక్కడి గోలరా బాబు అంటూ మండిపడ్డారట.

పెళ్ళికి వచ్చిన వాడు ఆశీర్వదించాలి గాని రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఏంటి అంటూ నవ్వుకున్నారట.చివరిగా వెళ్ళే ముందు మీరందరూ నన్ను బాగా మిస్ అవుతున్నారని నాకు తెలుసు టైం వస్తుందని వెళ్లిపోవడంతో పెళ్లికి వచ్చిన వారు నవ్వు ఆపుకోలేక పోయారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube