టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ ? ఇప్పుడు కాదు అప్పుడే ?

ఎన్ని రకాలుగా చూసుకున్న జనసేన తెలుగుదేశం పార్టీని విడదీసి చూడలేము అన్నట్లుగానే ఈ రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొంటున్నాయి.2019 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేసి ఎన్నికలకు వెళ్లాయి.కానీ రెండు పార్టీలు తీవ్రంగానే నష్టపోయాయి.ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాలు వెలువడ్డాక కానీ ఈ విషయం అర్థం కాలేదు.అనవసరంగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళాము అనే బాధ టీడీపీ అధినేత చంద్రబాబు లో బాగా కనిపించింది.ఇక జనసేన పార్టీ లోనూ ఇదే కనిపించింది.

 Tdp Janasena Is Likely To Form An Alliance Soon Janasena, Bjp, Tdp, Ysrcp, Tirup-TeluguStop.com

ఏపీలో బలం లేని బీజేపీతో కంటే, టీడీపీతో వెళ్తే అనుకున్న ఫలితం దక్కేది అని, తప్పనిసరిగా టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చేవి అనే అభిప్రాయం వారిలో ఉంది.ప్రస్తుతం బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతోంది.

కానీ ఏపీలో క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల బలం అంతంత మాత్రమే.దీంతో మళ్లీ టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి.

Telugu Chandrababu, Janasena, Pavan, Tirupathi, Ysrcp-Telugu Political News

అది కాకుండా బీజేపీ వైఖరి తో పవన్ ఆగ్రహంగా ఉన్నారని, తిరుపతి ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన బిజెపికి పవన్ దూరంగా ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, పవన్ కు అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్త టిడిపి జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిర్చే పనికి రంగంలోకి దిగారట.విడివిడిగా వెళ్తే లాభం లేదని, మీరిద్దరూ కలిస్తేనే అధికారం దక్కించుకోవడం సాధ్యమవుతుందని, లేకపోతే మళ్లీ వైసీపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని లెక్కలతో సహా వివరించి మరీ పొత్తు పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారట.

అయితే ప్రస్తుతానికి పవన్ బీజేపీతో కలిసి వెళ్లినా, 2024 ఎన్నికలకు ముందే బీజేపీకి దూరమై, టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండటంతో , త్వరలోనే ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube