అడ్డంగా బుక్కైన బండ్ల గణేష్... ఏం చేసాడంటే?

నటుడు బండ్ల గణేష్ తెలియని సినీ అభిమాని ఉండడు.ఎందుకంటే నటులు తమ సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకుంటారు.

 Ganesh Of The Horizontally Booked Cart  What Did He Do Comedian Bandla Ganesh, P-TeluguStop.com

కాని బండ్ల గణేష్ తన వ్యక్తిత్వం, నడవడిక ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు.బండ్ల గణేష్ అంటే పేరు కాదు బ్రాండ్ అనే తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడు బండ్ల గణేష్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ముద్ర పడిన బండ్ల గణేష్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో బ్లేడు గణేష్ గా ముద్ర పడ్డాడు.అప్పుడు నెటిజన్ల చేతిలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాడు.

ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో రిలీజ్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో బండ్ల గణేష్ స్పీచ్ కొరకు కూడా అంతే వెయిట్ చేస్తారంటే బండ్ల గణేష్ రేంజ్ ఏమిటదనేది మనం అర్థం చేసుకోవచ్చు.అయితే బండ్ల గణేష్ ఇప్పటి వరకు మాటలతో సంచలనం సృష్టించే బండ్ల గణేష్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ద్వారా నవ్వుల పాలయ్యాడు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మాస్కు తప్పనిసరి చేస్తూ కఠిన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రస్తావించడానికి బండ్ల గణేష్ ప్రయత్నించాడు.

అయితే wear a mask అని అనాల్సి పోయి మొదట where mask అని ట్వీట్ చేశాడు.నెటిజన్ల ట్రోలింగ్ తో మరల ఆ ట్వీట్ ను తొలగించి మరల ware mask అని మరలా తప్పుగా ట్వీట్ చేశాడు.

ఇక నెటిజన్లు గణేషన్నా నీది ఏ స్కూల్ అన్నా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube