లోకేష్ పై నమ్మకం లేదా ..ఎన్టీఆర్ రావాల్సిందేనా  ? బుచ్చయ్య మాటల వెనుక ? 

చాలాకాలం నుంచి తెలుగుదేశం పార్టీతో పాటు, జనాలలోనూ చర్చ జరుగుతున్న విషయం తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు , చంద్రబాబు వయస్సు ,లోకేష్ శక్తిసామర్ధ్యాలు ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు టిడిపి నాయకులు.

 Tdp Ml  Buchhayya Chowdary Sensational Comments On Jr Ntr  Gorantla Buchhayya Ch-TeluguStop.com

ఆ పార్టీలోని సీనియర్ రాజకీయ నాయకులు , యువ నాయకులు, ఇలా అంతా జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలో మళ్లీ యాక్టివ్ కావాలని, పార్టీని అధికారం వైపు తీసుకు వెళ్ళ గలిగే శక్తి సామర్ధ్యాలు ఆయనలో ఉన్నాయని,  త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చర్చ చాలా కాలం నుంచి వస్తూనే ఉంది.అయితే జూనియర్ మాత్రం ఎక్కడా ఈ వ్యవహారాలపై స్పందించడం లేదు.

అయినా ఎన్టీఆర్ ప్రస్తావన మాత్రం పదే పదే వస్తూనే ఉంది.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

పార్టీకి సంబంధించి ఏ విషయమైనా , ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడగలిగే బుచ్చయ్య ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీలోకి కొత్త నాయకత్వం రాబోతోందని, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, కొంతమంది టిడిపి కోసం పని చేయాలని కోరుతున్నారు.

ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని బుచ్చయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు టిడిపి లో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఎందుకంటే చంద్రబాబు తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రమోట్ చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Chandrababu, Lokesh-Telugu Political News

తన తరువాత తన రాజకీయ వారసుడిగా టిడిపి బరువు బాధ్యతలు మొత్తం మోసే వ్యక్తిగా లోకేష్ ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.అయినా, పార్టీ నాయకుల్లో లోకేష్ పై నమ్మకం లేక పోగా, పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి, లోకేష్ ఎన్టీఆర్ కు మధ్య పోలిక పెట్టి చూస్తూ ఉండడం,  జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని వ్యాఖ్యలు చేస్తున్న వంటి వ్యవహారాలు బాబుకు చికాకు కలిగిస్తున్నాయి.ఇప్పుడు బహిరంగంగా బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలపై  బాబు ఆగ్రహంగా ఉన్నారట.

దీనిపై యాక్షన్, రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube