షర్మిలకు ఆగ్రహం తెప్పిస్తున్న పోలీసు ఆంక్షలు... సభ జరిగేనా?

తెలంగాణ రాజకీయాలలోకి అకస్మాత్తుగా వచ్చిన షర్మిల రోజు రోజుకు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది.అయితే షర్మిల పార్టీ ఏర్పాటు సభపై సస్పెన్స్ కొనసాగుతోంది.

 Ys Sharmila Angry Over Police, Telangana, Police Restrictions, Ys Sharmila New P-TeluguStop.com

మొదట లక్ష మందితో సభ ఏర్పాటుకు పోలీసులు అనుమతినిచ్చినా వరుసగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు వేల మంది పాల్గొనడానికి మాత్రమే పోలీసులు అనుమతినివ్వడంతో షర్మిల అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఆవిర్భావ సభ కావడంతో ప్రజలు ఎక్కువ మంది కనబడితేనే ఒక గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని, లేకపోతే సభ ఫెయిల్ అవుతుందని షర్మిల అనుచరులు భావిస్తున్నారు.

కేసీఆర్ లాంటి నాయకుడే ఓ సభకు జనాలు రాకపోతే సభను రద్దు చేసుకున్న చరిత్ర ఉంది.అయితే రిస్క్ చేసి సభ ఏర్పాటు చేసినా షర్మిల పార్టీ ఒక బలమైన పార్టీగా ప్రజల్లో ముద్ర పడదని భావిస్తున్నారు.

దీనిపై షర్మిల అధికారికంగా స్పందిచక పోయినా సభ నిర్వహణ కష్టమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు వాయిదా పడితే ఇక సభ నిర్వహణ కష్టమే నన్న భావన వ్యక్తమవుతోంది.

ఎందుకంటే రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రకటిస్తున్న పరిస్థితులలో ఇక సభ నిర్వహణ అసాధ్యం.ఒకవేళ పార్టీ ఏర్పాటు ప్రకటన ఆలస్యమైతే షర్మిల నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

చూద్దాం ఏం జరుగుతుందో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఆగల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube