జ్ఞాపక శక్తిని రెట్టింపు చేసే ధ‌నియాలు.. ఎలా తీసుకోవాలంటే?

జ్ఞాప‌క శ‌క్తి లోపించ‌డం.ఇటీవ‌ల కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ పడుతున్నారు.

 Coriander Seeds Can Improve Memory Power! Coriander Seeds, Improve Memory Power,-TeluguStop.com

వ‌య‌సు పెరిగే కొద్ది జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, యుక్త వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య దాప‌రిస్తే.

ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల్సిన విష‌య‌మే.మెద‌డు ప‌ని తీరు మంద‌గించిన‌ప్పుడు.

జ్ఞాపక శక్తి కూడా క్షీణిస్తుంది.దాంతో చిన్న విష‌యాలు, పెద్ద విష‌యాలు అనే తేడా లేకుండా అన్నింటిని మ‌ర‌చిపోతుంటారు.

అయితే జ్ఞాపకశక్తి పెరగటానికి, ఆలోచన విధానం మెరుగుపడటానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో ధ‌నియాలు ఒక‌టి.

అంద‌రి వంటింట్లోనూ ఉండే ధ‌నియాలు మంచి రుచి, వాస‌న క‌లిగి ఉండ‌ట‌మే కాదు.పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇలా ఎన్నో పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే ధ‌నియాలు ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ముఖ్యంగా జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయ‌డంలో ధ‌నియాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

మ‌రి ధ‌నియాల‌ను ఎలా వాడాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని ధ‌నియాలు తీసుకుని లైట్‌గా డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో యాలకులు, పటికబెల్లం కూడా వేసి పొడి చేసి పెట్టుకోవాలి.ఈ పొడిని రోజు ఉద‌యం గ్లాస్ పాల‌లో క‌లిపి తీసుకోవాలి.

Telugu Brain, Coriander Seeds, Tips, Improve Memory, Latest, Memory-Telugu Healt

ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల ‌జ్ఞాపక శక్తి పెరుగుతుంది.అంతేకాదు మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఒత్తిడి దూర‌మై పనులపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది.అలాగే ధ‌నియాల‌ను పొడిని వాట‌ర్‌లో వేసి బాగా మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.ఆ వాట‌ర్‌లో తేనె క‌లిపి సేవించాలి.ఇలా చేసినా జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.

పైగా ఈ ధ‌నియాల వాట‌ర్‌ తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు కూడా క‌రుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube