స్మైలింగ్ ట్రీ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా... అసలు ఎక్కడ ఉందో తెలుసా..??

ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి.మనసు పెట్టి చూడాలే గాని ప్రకృతిలో కనిపించే ప్రతిదీ మనకు అందంగానే కనిపిస్తుంది.

 Have You Ever Heard Of The Smiling Tree  Do You Know Where The Original Is , Smi-TeluguStop.com

నిజానికి ప్రకృతి లేని ప్రపంచాన్ని మనం ఎక్కడ చూడలేము.అసలు ప్రకృతి లేని సృష్టే లేదు అనడంలో అతిశయోక్తి లేదు.

ఎన్నో వింతలు, అద్భుతాలు దాగున్నాయి ఈ ప్రకృతిలో.కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి.

మరికొన్ని మాత్రం ఎప్పటికో బయట పడతాయి.ఆ వింతలు చూస్తే నిజంగా నమ్మ బుద్ధి కాదు.

ఇప్పుడు అలాంటి ఒక ప్రకృతి వింత ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అసలు ప్రకృతిలో ఇంత అందం దాగి ఉందా.

ఇన్ని వింతలు ఉన్నాయా ? అని అనిపిస్తుంది.మరి ఆ వింత ఏంటో తెలుసుకుందామా.

సాధారణంగా ప్రతి మనిషికి చక్కిలిగింతలు అనేవి సర్వ సాధారణంగా ఉంటాయి.ఎవరైనా మనల్ని తాకినప్పుడు చక్కిలిగింతలు పుట్టి నవ్వడం గమనించే ఉంటాము.ఈ చక్కలిగింతలు పసి పిల్లల విషయంలో బాగా గమనించి ఉంటాము.పిలల్లకు చక్కలిగిలి పెట్టినప్పుడు పకపక మంటూ మురిసిపోతూ గట్టిగా నవ్వుతు ఉంటారు కదా.అలాగే కొన్ని జంతువుల విషయంలో కూడా ఇలాంటివి వింటూ ఉంటాం.మనం పెంచుకొనే కొన్ని జంతువులకు చక్కిలిగింతలు పెట్టి నవ్వించడానికి ట్రై చేస్తాం.

అయితే మరి మీరు ఎప్పుడైనా మీ పెరటిలో పెంచుకునే మొక్కలకు ఎప్పుడన్నా చక్కలిగింతలు పెట్టారా.లేదు కదా.అసలు చెట్టుకి చక్కలిగింతలు పెట్టడం ఏంటి.మీకేమన్నా పిచ్చా అనుకుంటున్నారా.

కానీ ఇది నమ్మలేని నిజం.మనం అక్కడ ఉన్న చెట్టుని తాకినా వెంటనే ఆ చెట్టు నవ్వుతుందట మరి.మీరు విన్నది నిజమే.మరి నవ్వే చెట్టును మీరు చూడాలనుకుంటున్నారా ? అయితే ఉత్తరాఖండ్ లోని కళదుంగి అడవులకు వెళ్లవలిసిందే.

వివరాల్లోకి వెళితే రాండియా డుమిటారమ్‘.కళదుంగి అడవులలో ఉండే ఈ చెట్టు బెరడును సుతారంగా తాకినా నవ్వుతున్నట్లు ఆకులను కదిలిస్తుంది అంట.ఒక వ్యక్తి చేయి తాకినా అది వెంటనే కదలడం మొదలుపెడుతుంది.అంటే దానికి చక్కిలిగింతలు పుడుతున్నట్లు అర్థమన్నమాట.

అందుకే ప్రజలు ఈ చెట్టుకు స్మైలింగ్ ట్రీ అని పేరు కూడా పెట్టుకున్నారు ఈ నవ్వే చెట్టును చూడడానికి ప్రతి ఏడాది వందల సంఖ్యలో పర్యాటకులు అక్కడకి తరలివస్తున్నారట.అయితే ఆ చెట్టుకు చక్కిలిగింతలు రావడం వెనుక ఉన్న కారణం కోసం పరిశోధకులు ఇప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు.

దీనివెనుక కారణమేంటి అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం గానే ఉంది.ఏది ఏమైనా ప్రకృతిలో ఉన్న వింతల్లో ఈ చెట్టు కూడా ఒక అద్భుతమైన వింత అని చెప్పవచ్చు.!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube