లాక్ డౌన్ పెట్టే ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి..

భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

 Delhi Health Minister Says He Has No Plans To Lock Down, Lock Down, Carona Virus-TeluguStop.com

కరోనా తో మరణించే బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.గతేడాది కూడా మార్చి నెలలోనే కరోనా వైరస్ కేసులు పెరగడం ప్రారంభించాయి.

ఈ ఏడాది కూడా మార్చి నెల నుంచే కరోనా వ్యాప్తి పెరుగుతూ అందరినీ కలవరపెడుతోంది.అయితే గత ఏడాది లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కూడా లాక్ డౌన్ విధిస్తాయా అనే సందేహం ప్రజల్లో ఉత్పన్నమవుతోంది.

కొన్ని దిక్కుమాలిన న్యూస్ ఛానళ్ళు లాక్ డౌన్ విధించడం ఖాయమని ప్రచారం చేస్తున్నాయి.సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది.

కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించడంతో ప్రజలు జోరుగా సాగుతున్న లాక్ డౌన్ ప్రచారాలు నిజమేనని నమ్ముతున్నారు.దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టె ఆలోచన తమకు లేదని స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన భారతదేశం ఇంకా ఆంక్షలు పెట్టుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుందని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ జోలికి వెళ్లడం లేదు.

ఈ క్రమంలోనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా లాక్ డౌన్ పెట్టే ఆలోచన తమకు లేదని.తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కుండ బద్దలు కొట్టేశారు.

ఢిల్లీ మహానగరం లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ఆయన చెప్పుకొచ్చారు.లాక్‌డౌన్ అనేది వైరస్ కట్టడికి శాశ్వత పరిష్కారం కాదని.ప్రజలు కరోనాతో సహజీవనం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు.21 రోజుల పాటు అన్ని కార్యకాలాపాలకు దూరంగా ఉంటే కరోనా వ్యాప్తి దానంతటదే ఆగిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.వయస్సుని బట్టి ఎప్పుడు వ్యాక్సిన్ ని అందుబాటులోకి తెస్తారో.అప్పుడు వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube