అనాథ శవంతో 3 కిలోమీటర్ల ప్రయాణం.. పోలీసుల్లో వికసించిన మానవత్వం.. !

నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే మనుషుల్లో కూడా రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి.ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి వ్యక్తులు తరచుగా తారసపడుతుంటారు.

 Blooming Humanity In The Police  Ramb, Sitapaleillim Beach, Si Arun Kiran, Trave-TeluguStop.com

మంచితం అంటే తెలియకుండా ప్రవర్తించే పోలీసుల్లో కూడా మానవత్వంతో మసలుకునే వారున్నట్లుగా అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి.

ఇలాంటి వారి గురించి వినగానే కొంత ఆశ్చర్యం కలిగిన ఇంకా మంచి చేసేవారు పోలీస్ డిపార్ట్‌మెంట్లో ఉన్నందుకు ఆనందపడాలని అనిపిస్తుంది.

ప్రస్తుతం మనం చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.ఆ వివరాలు చూస్తే.

విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండలంలోని సీతపాలెం సముద్ర తీరంలో ఒక అనాథ శవం కొట్టుకు రాగా, విషయం తెలుసుకున్న స్దానిక ఎస్ఐ అరుణ్ కిరణ్ ఘటనా స్దలానికి చేరుకున్నారు.ఈ నేపధ్యంలో మృత దేహాన్ని అక్కడి నుండి తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, దీంతో ఎస్ఐ అరుణ్ కిరణ్ తన టీమ్ తో కలిసి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ ఆ శవాన్ని తీసుకువెళ్లారు.

ఇక ఇలాంటి ఘటనే గత కొద్ది నెలలక్రితం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.కాశీబుగ్గకు చెందిన మహిళా ఎస్సై శిరీష ఓ అనాథ శవాన్ని మోసుకెళ్లి ఎందరివో ప్రశంసలు అందుకున్నారు.

మరోసారి ఎస్ఐ అరుణ్ కిరణ్ ఆ పని చేసిన పోలీసుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube