కోటలు దాటుతున్న షర్మిల మాటలు...ఇక రణరంగమేనా?

ఏప్రిల్ 9 న షర్మిల తన పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే.అయితే షర్మిలకు ఆది లోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి.

 Sharmila's Words Crossing The Forts Is It A Battlefield, Y.s.sharmila, Telangana-TeluguStop.com

కోవిడ్ విజృంభణ దృష్ట్యా కొద్ది మంది ప్రజలతోనే సభకు పోలీసులు అనుమతి ఇచ్చినందున కొద్ది మంది జనాభాతో మాత్రమే సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల షర్మిల పార్టీ నాయకులు, వైయస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలి వస్తున్నారు.

కొంత మంది యువ నేతలు పాదయాత్ర కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ అందరి చూపు బహిరంగ సభపై ఉంది.

షర్మిల ఏమని మాట్లాడుతుంది, తెలంగాణ రాజకీయాలపై తన స్టాండ్ ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనే విషయం వెల్లడి కానుంది.అంతేకాక షర్మిల పార్టీలో చేరే నేతల చిట్టా కూడా బయటకు రానుంది.అయితే ప్రస్తుతం షర్మిల చేసే వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విమర్శిస్తున్నారు.2023లో అధికారంలోకి రాబోయేది మన ప్రభుత్వమే అని బాహాటంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇంకా పార్టీ పేరు ప్రకటించలేదు, పార్టీ జెండా విడుదల కాలేదు.అప్పుడే అధికారం గురించి మాట్లాడటం అనేది మాటలు కోటలు దాటుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube