కర్ణాటక అడవుల్లో బాలయ్య బోయపాటి..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

 Balakrishna Movie Climax To Be Shoot In Karnataka Dandeli Forest, Dandeli Forest-TeluguStop.com

ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాపై వీరి కన్ను పడింది.ఇప్పుడు చేయబోయే సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ సినిమాను తమ ఖాతాలో వేసుకుంటారు.

అయితే ఈ సినిమా ఇప్పటి కే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది.అయినా ఈ సినిమా టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.ఈ సినిమా టైటిల్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా పై లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని దండేలి అడవుల్లో జరుగుతుంది.బోయపాటి ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ అడవుల్లోని షూట్ చేయబోతున్నాడట.

ఈ షూటింగ్ ఏప్రిల్ 3 వరకు అక్కడే జరుగుతుందట.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ, ప్రగ్యా ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ గా నటిస్తున్నారు.పూర్ణ డాక్టర్ గా కనిపించబోతుందట.ఈమె పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందని సమాచారం.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా టైటిల్ కు చాలా రకాల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇంకా చిత్ర యూనిట్ ఏది ఫైనల్ చేయదు.ఈ సినిమాను మే 28 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube