ఎఫ్3లో మూడో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన సోనాల్ చాహన్

స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఎఫ్2 సీక్వెల్ గా ఈ మూవీ రెడీ అవుతుంది.వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ పాత్రల చుట్టూనే మొదటి సినిమాకి కొనసాగింపుగా ఈ సీక్వెల్ కథ ఉండబోతుంది.దిల్ రాజు ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

 Sonal Chauhan To Play Cameo In F3, F2 Movie, F3 Movie, Anil Ravipudi, Sonal Chau-TeluguStop.com

భారీ మొదటి సినిమాలో ఉన్న పాత్రలన్నీ ఈ సినిమాలో కూడా కొనసాగింపుగా ఉంటాయని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.ఈ సినిమాలో మనీ చుట్టూ అనిల్ రావిపూడి ఈ సారి ఫన్ ని జెనరేట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.ఇక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని కొత్త పాత్రలని కూడా పరిచయం చేస్తున్నారు.

అందులో భాగంగా సినిమాలో మూడో హీరోయిన్ కి స్కోప్ ఉండటంతో ఓ హాట్ బ్యూటీని ఫైనల్ చేశారని సమాచారం.

బాలకృష్ణతో ఏకంగా మూడు సినిమాలలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చాహన్ ని ఈ మూడో హీరోయిన్ పాత్ర కోసం ఖరారు చేసినట్లు బోగట్టా.

ఇప్పటికే ఆమెకి కథ కూడా చెప్పడం జరిగిందని, ఆమె త్వరలో షూటింగ్ లో జాయిన్ అవుతుందని తెలుస్తుంది.సినిమాని ఈ ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దీని తర్వాత అనిల్ రావిపూడి మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది.అది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube