బెంగాల్ ఒపీనియన్ పోల్స్ లో సత్తా చాటుతున్న బిజెపి..!!

బెంగాల్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ప్రస్తుత అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య పోటాపోటీ ఉన్నట్లు అనేక సర్వేలలో బయటపడింది.ఈ నేపథ్యంలో తాజాగా పీపరల్స్ పల్స్ ఒపీనియన్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి  జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో 183 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 93, వామపక్షాల కూటమికి16 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.

 Bjp Is Gaining Ground In The Bengal Opinion Polls Bjp,tmc,bengal Elections,opin-TeluguStop.com

ఇక సి ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో కూడా బీజేపీకి 160, తృణమూల్ కాంగ్రెస్ కి 112, వామపక్షాల పార్టీకి 12 స్థానాలు వస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది.పరిస్థితి ఇలా ఉండగా సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం బీజేపీకి – తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి తప్పదని స్పష్టం చేసింది.

బిజెపి పార్టీకి 135, మమతా బెనర్జీ పార్టీకి 141, లెఫ్ట్ కూటమికి 16 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది.ఇదే తరుణంలో టైమ్స్ నౌ సర్వే మాత్రం దాదాపు పది సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ సరి తక్కువ స్థానాలు వచ్చినా గానీ కచ్చితంగా అధికారం కైవసం చేసుకుంటుందని స్పష్టం చేసింది.

ఇటువంటి తరుణంలో ఒపీనియన్ పోల్స్ లో బిజెపి పార్టీ చాలా వరకు గెలిచినట్లు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ బీజేపీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube