మళ్లీ థియేటర్లు క్లోజ్..??

దేశంలో కరోనా వైరస్పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం లో అలజడి మొదలైంది.ఊహించని విధంగా కేసులో ఒక్కసారిగా దేశంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని తెలపటం మాత్రమేకాక వ్యాక్సినేషన్ పంపిణీ కేంద్రాలు వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలని తెలిపారు.

 Again All Cinima Theaters Closed Corona Virus, Corona Positive Cases, Telangana,-TeluguStop.com

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు క్లోజ్ చేయడం మనకందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న థియేటర్లు కూడా క్లోజ్ చేస్తే బెటర్ అని తాజాగా వైద్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించటం జరిగిందట.

కొత్త సినిమా రిలీజ్ అయితే దాదాపు థియేటర్ 90% నిండిపోవడం మాత్రమే కాక , థియేటర్లలోకి వచ్చిన ఎవరు కూడా మాస్కులు ధరించి కుండా వస్తున్న నేపథ్యంలో , ఏసీ సినిమా ధియేటర్ లో తలుపులు వేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో వైరస్ విస్తరణ భారీ స్థాయిలో ఉంటుందని ఈ ప్రతిపాదన తాజాగా తెరపైకి తీసుకు రావడం జరిగింది.ఈనేపథ్యంలో సినిమా హాల్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశంలో చాలా రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు క్లోజ్ చేసే ఆలోచనలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లు సమాచారం. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube