యూఎస్: వివాహ స్థిరత్వంలో అమెరికన్ల కంటే భారతీయులే టాప్, సర్వేలో ఆసక్తికర విషయాలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.పొట్ట చేత పట్టుకుని వెళ్లిన వారు ఆదాయంలో స్థానికుల్నే అధిగమిస్తున్నారు.

 Marriage Stability Highest Among Indian Americans In Us, New Report Reveals, Mar-TeluguStop.com

ఎన్నో సంస్థల సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి.ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.

స్థానిక అమెరికన్ కుటుంబాల కంటే వలస వచ్చిన కుటుంబాలే స్థిరంగా వున్నట్లు తేలింది.వీరిలో భారతీయ అమెరికన్ కుటుంబాలు వివాహ స్థిరత్వం విషయంలో ముందున్నాయి.

వివాహం , కుటుంబ విలువలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ (ఐఎఫ్ఎస్) ఒక సర్వే నిర్వహించి.నివేదికను ప్రచురించింది.

అమెరికాలోని జనాభా లెక్కల ఆధారంగా, పిల్లలతో సహా వలస వచ్చిన వారిలో 72 శాతం వారి మొదటి వివాహంతోనే స్థిరంగా వున్నారని తేలింది.అదే స్థానిక అమెరికన్ల విషయానికి వస్తే.69 శాతం మంది మాత్రమే వారి మొదటి వాహహంలోనే వున్నారు.స్థానిక అమెరికన్లతో పోల్చినప్పుడు వలస వచ్చిన వారికి సాధారణంగా అధిక వివాహ రేటు, విడాకుల రేట్లు తక్కువగా వుంటాయని ఐఎఫ్ఎస్ రీసెర్చ్ డైరెక్టర్ వాంగ్ చెప్పారు.2019లో 18-64 మధ్య వయస్సు గల ప్రతి 1,000 మంది పెళ్లి కాని వలసదారుల్లో కనీసం 59 మంది వివాహం చేసుకున్నారని నివేదిక పేర్కొంది.ఇదే సమయంలో స్థానిక అమెరికన్లలో 39 మందే పెళ్లి చేసుకున్నారు.

Telugu Divorce, Stability, Stabilityindian, Marriages, Reveals, Nris, Repory-Tel

ఇక వలసదారులతో పోలిస్తే స్థానికంగా జన్మించిన అమెరికన్లలో విడాకుల రేటు చాలా ఎక్కువ.18-64 సంవత్సరాల వయస్సు గల 1000 మంది వివాహితులైన వలసదారులలో కేవలం 13 మంది మాత్రమే తమ భాగస్వామి నుంచి విడిపోయారు.అదే వయసు కేటగిరీలో స్థానికంగా జన్మించిన అమెరికన్లలో ప్రతి 1000 మందికి 20 మంది విడాకులు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది.

వలసదారులలో కూడా ఈ సంఖ్య స్థిరంగా లేకుండా మారుతూ వుంది.కుటుంబ స్థిరత్వపరంగా భారతీయ అమెరికన్లు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.2019లో నిర్వహించిన సర్వే ప్రకారం.భారతీయ వలసదారులలో 94 శాతం మంది స్థిరమైన వివాహ బంధంలో వున్నారని నివేదికలో తేలింది.ఇదే సమయంలో 4 శాతం మంది భారతీయ అమెరికన్లు మాత్రమే రెండో పెళ్లి చేసుకున్నారు.

పిల్లలతో కలిసి వున్న రెండు శాతం మంది ద్వితీయ వివాహం చేసుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.భారతీయుల తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ (90), పాకిస్తాన్ (87), తైవాన్ (86), దక్షిణ కొరియా (85), చైనా (84), జపనీయులు (53) శాతంగా వున్నారు.

ఏదేమైనా అమెరికాలో స్థిరపడిన ఆసియా కుటుంబాలు స్థిరమైన వివాహాలను కలిగి వున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube