ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ తలరాతే మారిపోయింది.తొలి సినిమాతోనే ఎన్నో అరుదైన రికార్డులు వైష్ణవ్ తేజ్ సొంతమయ్యాయి.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినా కొంతమంది హీరోలు సొంతం చేసుకోలేని రికార్డులను వైష్ణవ్ తేజ్ మాత్రం సునాయాసంగా అందుకున్నాడు.స్టార్ డైరెక్టర్లు సైతం వైష్ణవ్ తేజ్ తో సినిమాలు తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే వైష్ణవ్ తేజ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే త్రివిక్రమ్ వైష్ణవ్ తేజ్ సినిమాకు కేవలం కథ మాత్రమే అందిస్తారని సమాచారం.
ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలియాల్సి ఉంది.వైష్ణవ్ తేజ్ త్రివిక్రమ్ సినిమా అంటే రిలీజ్ కు ముందే భారీగా అంచనాలు ఏర్పడతాయని చెప్పవచ్చు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సారాంశం.ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తరువాత సినిమాను తెరకెక్కించనున్నారు.
ఈ సినిమా తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో లేదా పవన్ మహేష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం.మరోవైపు ఎన్టీఆర్ కొరకు త్రివిక్రమ్ ఇప్పటికే పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను సిద్ధం చేయగా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ మరోసారి పవర్ ఫుల్ మాస్ రోల్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తరువాత ఏడాది గ్యాప్ రావడంతో గ్యాప్ రాకుండా భవిష్యత్ ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసుకుంటున్నారు.
ఒకవైపు డైరెక్టర్ గా బిజీగా ఉంటూనే పవన్ కొన్ని సినిమాలకు కథ, మాటలు అందిస్తుండటం గమనార్హం.