వందల సంఖ్యలో క్రాష్ అవుతున్న ఆండ్రాయిడ్ యాప్స్..! సమస్యను తేల్చే పనిలో గూగుల్..!

ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు.అదేంటంటే గత కొద్ది రోజులుగా గూగుల్ పే, గూగుల్ క్రోమ్ వంటి కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు క్రాష్ అవుతున్నాయి.

 Hundreds Of Android Apps Are Crashing Google Responded, Android Apps, Google, C-TeluguStop.com

భారతదేశంలో కూడా ఈ సమస్యతో బాధపడే వినియోగదారులు చాలామంది ఉన్నారు.ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఆండ్రాయిడ్ జీమెయిల్ అప్లికేషన్ తరచూ క్రాష్ అవుతుందని ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి.దీంతో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ స్పందించింది.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో జీమెయిల్ అప్లికేషన్ ని ఓపెన్ చేయలేకపోతున్నారని.ఓపెన్ చేసిన కొద్ది క్షణాల్లోనే అప్లికేషన్ క్రాష్ అవుతుందని.

తాము ఈ సమస్యను గుర్తించామని గూగుల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.అయితే ఈ సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులు తాత్కాలికంగా డెస్క్ టాప్ వెర్షన్ లో జీమెయిల్ సేవలను ఉపయోగించాలని గూగుల్ సంస్థ విజ్ఞప్తి చేసింది.

అప్లికేషన్స్ క్రాష్ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామని గూగుల్ సంస్థ వినియోగదారులకి హామీ ఇచ్చింది.

Telugu Android Apps, Crash, Desktop Gmail, Gmail, Google, Google Apps, Google Ch

ఇదిలా ఉండగా సౌత్ కొరియన్ దిగ్గజ మొబైల్ కంపెనీ సాంసంగ్ కూడా జీమెయిల్ అప్లికేషన్ క్రాష్ సమస్య పై స్పందించింది.తమ కంపెనీ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్న యూజర్లు ఒక చిన్న సెట్టింగ్ మార్చితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు అని సాంసంగ్ సంస్ధ తెలిపింది.అది ఏంటంటే సాంసంగ్ యూజర్లు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి.

యాప్స్ సెక్షన్ పై క్లిక్ చేసి.సిస్టం అప్లికేషన్ల కోసం సెట్ చేయాలి.

అనంతరం వెబ్ వ్యూ(WebView) అప్లికేషన్ పై క్లిక్ చేసి.కుడి వైపు పై భాగంలో ఉన్న మూడు డాట్స్ పై నొక్కాలి.

అప్పుడు “అన్ఇన్స్టాల్ అప్డేట్” అనే ఆప్షన్ కనిపిస్తుంది.ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్డేట్స్ అన్ఇన్స్టాల్ అవుతాయి.

దీనితో జీమెయిల్ క్రాష్ సమస్య నుంచి సెకండ్ల సమయంలో బయటపడవచ్చు.సామ్సంగ్ వినియోగదారులే మాత్రమే కాదు ఇతర కంపెనీ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు కూడా ఇదే తరహాలో సెట్టింగ్స్ మార్చుకుని జీమెయిల్ అప్లికేషన్ని యాక్సెస్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube