బ్యాంకు రుణాల‌పై కీల‌క తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు.. !

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అప్పుల్లో దేశ ప్రజలే కాదు, రాష్ట్రాలు, దేశం కూడా కూరుకుపోయింది.ప్రభుత్వాలైతే అప్పుల లెక్కలు చూపిస్తున్నాయి గానీ, వచ్చిన ఫండ్ తాలూకూ లెక్కలు మాత్రం చూపించడం లేదని కొందరు బాధ్యతగల విద్యావంతులు ఆవేదన చెందుతున్నారట.

 The Supreme Court Has Issued Judgment On Bank Loans,  Supreme Court, Interest, J-TeluguStop.com

ఇప్పటికే పలు బ్యాంకులు కూడా రుణాల ఉచ్చులో కూరుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రుణాల తాలూకు వ‌డ్డీ మాఫీల విషయంలో ఎలాంటి క్లారీటీ ఇప్పటి వరకు లేదు.

ప్రభుత్వాలు మాత్రం ప్రజలను మభ్యపెట్టడానికి సాధ్యం కానీ హామీలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి.ఇదిలా ఉండగా బ్యాంకు రుణాల‌పై గ‌తేడాది ఆరు నెల‌ల మార‌టోరియం విధించిన విష‌యం తెలిసిందే.

ఈ సమయంలో వ‌డ్డీ మాఫీ చేయాల‌ని, మార‌టోరియం కాలాన్ని పొడిగించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు ఈరోజు త‌న తీర్పు వెల్ల‌డించింది.

ఈ క్రమంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం రుణ గ్ర‌హీత‌కు ఈ ఆరు నెల‌ల కాలానికి గాను వ‌డ్డీ మీద వ‌డ్డీ వ‌సూలు చేయ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది.

అదే స‌మ‌యంలో మార‌టోరియం కాలాన్ని పొడిగించ‌డం సాధ్యం కాద‌న్న కోర్టు మొత్తం వ‌డ్డీ మాఫీ చేయ‌డం కూడా కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది.ఎందుకంటే బ్యాంకులు ఖాతాదారుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు వ‌డ్డీ చెల్లిస్తాయ‌ని, ఇలాంటి పరిస్దితుల్లో రుణాల‌పై బ్యాంకులు ఎలా పూర్తిగా వ‌డ్డీ మాఫీ చేస్తాయ‌ని కోర్టు ప్ర‌శ్నించింది.

ఈ ఆరు నెల‌ల స‌మ‌యంలో వ‌డ్డీపై వ‌డ్డీని పూర్తిగా మాఫీ చేస్తే అది ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని, బ్యాంకుల ఆర్థిక వ‌న‌రుల‌కు పెద్ద దెబ్బ ప‌డుతుంద‌ని ఆర్బీఐ వాదించింది.ఇకపోతే జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిస‌భ్య ధర్మాస‌నం ఈ కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube