అయోధ్య తవ్వకాలలో బయటపడ్డ ప్రాచీన అవశేషాలు..?

ఎన్నో దశాబ్దాలుగా రామమందిరం కోసం జరుగుతున్న వివాదములలో సుప్రీంకోర్టు ఎట్టకేలకు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలని ఆదేశించడంతో ఆలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం జరిగింది.ఈ క్రమంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గత ఏడాది మన ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 Idols And Things Unearthed During Ramalayam Excavations At Ayodhya Ramalaya  Ayo-TeluguStop.com

భూమి పూజ కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగు తున్నాయి.ఈ క్రమంలోనే దేశం నలుమూలల నుంచి భక్తులు ఆలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున కానుకలు, విరాళాలు ఇవ్వడం జరుగుతుంది.

ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగు తున్నాయి.ఈ క్రమంలోనే ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతున్న క్రమంలో ప్రాచీన అవశేషాలు బయట పడ్డాయి.

ఈ తవ్వకాలలో భాగంగా చరుణ పాదుకలతో పాటుగా ప్రాచీన విగ్రహాల అవశేషాలు బయటపడ్డాయి.అయితే ఈ అవశేషాలను గమనించిన రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు ఆ అవశేషాలను జాగ్రత్తగా బయటకు తీసి ఆ విగ్రహాలను జాగ్రత్తగా భద్రపరిచారు.

ఈ విధంగా తవ్వకాలలో బయటపడిన అతిప్రాచీన విగ్రహాలను పురావస్తు శాస్త్ర అధికారులు పరిశీలిస్తారని ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు తెలియజేశారు.అయితే ఈ విధంగా తవ్వకాలలో ప్రాచీన వస్తువులు బయట పడడం ఇది తొలిసారి కాదని, ఇంతకు మునుపే పలు తవ్వకాలలో ఇలాంటి ప్రాచీన అవశేషాలు బయట పడ్డాయి అని రామజన్మభూమి తీర్థ ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు.ఈ విధంగా తవ్వకాలలో బయటపడుతున్న పురాతన వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచి ఇక్కడ నిర్మించబోయే మ్యూజియంలో విగ్రహాల అన్నింటినీ ఏర్పాటు చేస్తామని ఆలయ ట్రస్టు అధికారులు తెలియజేస్తున్నారు.ఈ ఆలయ నిర్మాణం కోసం సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వరకు స్వామి వారి పై ఉన్న భక్తిభావంతో పెద్ద ఎత్తున స్వామివారికి విరాళాలు అందజేస్తున్నారు.

Idols And Things Unearthed During Ramalayam Excavations At Ayodhya Ramalaya Ayodhya

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube