ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న 'అరణ్య' డైరెక్టర్..!

సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

 Prabhu Solomon Shares Interesting News On Aranya Movie, Aranya, Rana Daggubati,-TeluguStop.com

ప్రస్తుతం రానా ‘అరణ్య‘ సినిమా పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లా కాకుండా ఒక ప్రత్యేక కథగా తెరకెక్కింది.

అరణ్య సినిమా ప్రేమఖైది, రైలు, గజరాజు వంటి సినిమాలు తీసిన తమిళ డైరెక్టర్ ప్రభు సాలొమోన్ దర్శకత్వం వహించారు.ఈ మధ్య రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో శ్రీయ, సామ్రాట్, విష్ణు విశాల్, జోయా హుస్సేన్ లు కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా మార్చి 26 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీగా ఉంది.

అరణ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ కార్య క్రమానికి రానా బాబాయి విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ క్రిష్, త్రివిక్రమ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఈ సినిమా డైరెక్టర్ ప్రభు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన పంచుకున్నారు.

Telugu Aranya, Prabhu Solomon, Prabhusolomon, Rana Daggubati-Movie

ఈ సినిమా ఏనుగులకు మనిషికి మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా కోసం దాదాపు 20 ఏనుగులకు ట్రైనింగ్ ఇచ్చి కస్టపడి ఈ సినిమా చేశామని ఆయన తెలిపారు.ఇలా ట్రైన్ చేసి సినిమా చేయడం చాలా కష్టమనిపించిందని.ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అయ్యిందని.ఈ సినిమాకు రానా అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడని ఆయనను తీసుకున్నానని డైరెక్టర్ ప్రభు తెలిపాడు.

ఈ మధ్య జంతువులను ఎలా హింసిస్తున్నారో, వాటిని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.

నిజ జీవితాలలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.ఈ సినిమాను తీయడం నాకు చాలా గర్వంగా ఉందని ఆయన తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube