బిబి3 కోసం ప్రయోగం చేస్తున్న బాలకృష్ణ

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ప్రస్తుతం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది.

 Balakrishna Original Look Surprise In Bb3 Movie, Tollywood, Boyapati Srinu, Nand-TeluguStop.com

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన సింహా, లెజెండ్ ని మించి ఈ సినిమా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా కోసం బోయపాటి చాలా ప్రయోగాలు చేస్తున్నాడని, బాలయ్య ఒరిజినల్ లుక్ ని కూడా అందరూ రిసీవ్ చేసుకొని కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.

బాలకృష్ణ ఏ సినిమాలో కూడా విగ్గు లేకుండా కనిపించడు.అయితే బోయపాటి మీద నమ్మకంతో మొదటి సారిగా ఈ సినిమాలో విగ్గు లేకుండా వయస్సు మళ్ళిన పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.అందులో ఎవరూ ఊహించని రీతిలో అఘోరా పాత్రలో కూడా బాలయ్యబాబు దర్శనం ఇస్తాడని గతంలోనే బోయపాటి రివీల్ చేశాడు.

అలాగే రైతు పాత్ర కూడా ఒకటి ఉంటుంది.ఈ మూడు పాత్రల మధ్య సంఘర్షణతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా సినిమా అద్బుతంగా ఉంటుందని టాక్ నడుస్తుంది.

ఇక ప్రతినాయకులుగా శ్రీకాంత్ తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు కూడా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇందులో బాలయ్యకి జోడీగా పూర్ణ, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి మొదటి సారి బాలకృష్ణ వెండితెరపై విగ్గు లేకుండా తన ఒరిజినల్ లుక్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో అతన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి.ఇక ఈ మూవీ షూటింగ్ కూడా చివరిదశకి వచ్చేసింది.

దీని తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube