ఐడియా అదుర్స్: ట్రాక్టర్ పై మొబైల్స్ సోలార్ బ్యాంక్.. రైతు వినూత్న ఆలోచన..!

ఒక వైపు మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ మరో వైపు రైతులు ఇప్పటికీ అనేక ప్రాంతాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.కొన్ని ప్రాంతాలలో  రైతులు కాలువలు, చెరువులు సదుపాయం లేని ప్రాంతాలలో కేవలం బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

 Idea Adurs: Mobiles Solar Bank On Tractor .. Farmer Innovative Idea Tracter, Up-TeluguStop.com

ఇదే వ్యవసాయానికి విద్యుత్ అవసరం చాలా ఉంటుంది.వ్యవసాయానికి కావాల్సిన  విద్యుత్ అంతంత మాత్రమే ఉండటంతో విద్యుత్ సమస్య నుంచి తప్పించుకునేందుకు ఒక రైతు భలే ఐడియా వేసి తానేంటో నిరూపించుకున్నాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఫ‌రూర్‌ ఖాబాద్‌ లో ఉన్న రాజేపూర్ బ్లాక్‌ లోని భుభియా భెడా అనే గ్రామంలో ఇటీవల వరదలతో బాగా నష్టాలుఎదురుకుంది.వరదల కారణంగా అప్పటి నుంచి విద్యుత్ తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఆ గ్రామంలో విద్యుత్ సరిగ్గా ఉండడం లేదు.

దీంతో అక్కడి గ్రామస్తులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ ఇబ్బందులు భరించలేక జోగేంద్ర సింగ్ అనే ఓ రైతు మొబైల్ పవర్ బ్యాంకు ను  ఏర్పాటు చేసి వ్యవసాయానికి కావాల్సినంత విద్యుత్ సమకూర్చుకున్నాడు.

ఇక ఆ పవర్ బ్యాంక్ కెపాసిటీ 2 కిలోవాట్లు.పగటి వేళ తాను తన పొలంతో పాటు ఇతర పొలాల వద్ద కూడా ఆ మొబైల్ బ్యాంకు ఏర్పాటు చేసి వారి వ్యవసాయానికి కావలసినంత విద్యుత్తును వారికి అందజేస్తున్నారు.

అంతేకాకుండా రాత్రివేళ ఆ ట్రాలీని తన ఇంటి వద్దకు తెచ్చిపెట్టడంతో అతని ఇంట్లోకి విద్యుత్ కూడా అందుతోంది.అలాగా అక్కడికే ఆ ఊరి గ్రామస్థులు కూడా వచ్చి వారి మొబైల్ ఛార్జింగ్ చేసుకుంటున్నారు.

ఇలా ఆ రైతు తో పాటు గ్రామస్తులు కూడా లబ్ధి పొందడంతో వారికి చేతనైనంత సహాయం అందజేస్తున్నారు.ఇలా ఉండగా మరోవైపు ఆ గ్రామంలో విద్యుత్ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయి అని అక్కడి రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

చూడాలి మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామస్తులకు ఎప్పుడు కరెంటు సమస్యలను తొలగిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube