తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్.. రామ్ రామ్.. !?

మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగిసింది.ఈ ఎన్నికల పక్రియ మొదలైనప్పటి నుండి నాయకులు హోరా హోరీగా పోరాడుతున్నారు.

 Professor Kodandaram Left The Telangana Mlc Elections  Telangana, Mlc Elections,-TeluguStop.com

గెలుపు తమదంటే తమదని ఆరోపణలు కూడా చేసుకున్నారు.

ఇక టీయార్ఎస్ పార్టీ అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

తమ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు.ఇక ఈ ఎన్నికల కౌంటింగ్ పక్రియ మూడు రోజుల నుండి సాగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికి గానీ సగం ఫలితమే తేలింది.కాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

అయితే రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికీ స్పష్టతమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య మాత్రం తీవ్రస్దాయిలో సమరం సాగుతుంది.

కానీ ఎమిలినేషన్ రౌండ్‌లో ప్రొఫెసర్ కోదండరాం ఎలిమినేట్ అయ్యారు.ఎందుకోగానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం, రాజకీయాల్లో మాత్రం ఏ పాత్ర పోషించకుండానే వెనకబడుతున్నారు.

కాగా నిరుద్యోగులు, పాత పరిచయాల ఓట్లపై నమ్మకం పెట్టుకున్నా అందరు మొండిచెయ్యి చూపించారు.అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ రామ్ రామ్ అనవలసిన పరిస్దితి తలెత్తిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube