వాయిదాః వర్మ కరోనాకు భయపడ్డాడా? లేదంటే మరేదైనా జరిగిందా

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడుతూ వచ్చింది.ఈయన దర్శకత్వంలో సినిమాలు వస్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు.

 Ram Gopal Varma D Company Release Post Pone , Bollywood ,film D Company ,davud I-TeluguStop.com

ఇలాంటి సమయంలో రామ్‌ గోపాల్ వర్మ రూపొందించిన డీ కంపెనీ సినిమా పై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.బాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అన్నట్లుగా వర్మ ప్రచారం చేసుకున్నాడు.

తప్పకుండా సినిమా ఆడుతుందని భారీ విజయాన్ని సొంతం చేసుకుని వందల కోట్ల ను వసూళ్లు చేస్తుందని తనదైన శైలి లో ప్రచారం చేసుకున్నాడు.కాని అనూహ్యంగా డీ కంపెనీ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.

రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా లో డీ కంపెనీ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో థియేటర్ల కు జనాలు రారేమో అనే ఉద్దేశ్యం తో సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు.

వర్మ ఇలాంటి విషయాలకు వెనక్కు తగ్గి సినిమాను వాయిదా వేసే రకం అస్సలు కాదు.కాని వర్మ ఎందుకు ఈ సినిమాను వాయిదా వేశాడు అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

డీ కంపెనీ అనేది దావూద్‌ బ్యాక్‌ డ్రాప్ లో తీసింది అనే విషయం తెల్సిందే.అందుకే ఈ సినిమా పెద్ద ఎత్తున వివాదాలను మూట కట్టు కుంటుంది.

ఈ కారణంగానే సినిమాను వాయిదా వేసి ఉంటాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రామ్ గోపాల్ వర్మ ను కరోనా కాకుండా మరి ఇంకేదో భయ పెట్టి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు గుస గుస లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube