సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్ లు వస్తుంటారు, వెళుతుంటారు.కొందరు ఎంతో అద్భుతంగా నటించి ఎన్నో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
వారు నటించిన సినిమాలు విజయాలు సాధించడంతో వారికి సినిమా ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రావడంతో, వారి పారితోషికాన్ని కూడా బాగా పెంచేసారు.అదేవిధంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో స్టార్డంను సంపాదించుకొని టాప్ హీరోయిన్ గా ఉన్న వారు వారు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో ఖరీదైనదిగానే ఉంటుంది.
వారు ఉపయోగించే లిప్స్టిక్ నుంచి మొదలుకొని డ్రెస్సులు వరకు ఎంతో ఖరీదైనవే.ఈ విధంగా ఎంతో ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే మన స్టార్ హీరోయిన్స్ కొందరు వారు ఉపయోగిస్తున్నటువంటి హ్యాండ్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే కళ్ళు తిరగడం ఖాయం.మరి ఏ హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ఎంత ఖరీదో ఇక్కడ తెలుసుకుందాం….
1) పూజా హెగ్డే: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో పూజా హెగ్డే ఒకరు.పూజా హెగ్డే తన అద్భుతమైన నటన ద్వారా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషలలో నటించే అవకాశాలను దక్కించుకున్నారు.
అయితే ఈ బుట్టబొమ్మ “బొట్టేగా వెనేట” అనే కంపెనీ హ్యాండ్ బ్యాగ్ ఉపయోగిస్తారు.ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు అక్షరాల2,17,218 రూపాయలు.ఎంతైనా బుట్ట బొమ్మ చాలా కాస్ట్లీ అని చెప్పవచ్చు.
2) రకుల్ ప్రీత్ సింగ్:
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.ఇకపోతే రకుల్ ప్రీత్ ఉపయోగించే “ఛానెల్” అనే కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ ను ఉపయోగిస్తారు.ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఏకంగా 3,33,918 రూపాయలు.
3) ఛార్మి:
ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్న ఛార్మి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ కూడా ఎంతో అద్భుతంగా నటించారు.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా మారిన ఛార్మి “హెర్మేస్” అని హ్యాండ్ బ్యాగ్ వాడతారు.ఈ హ్యాండ్ బ్యాగ్ ధర 4,85,846 రూపాయలు.
4) హన్సిక:
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చాయి.అయితే ఈమె తెలుగులో కన్నా తమిళంలో బాగా పాపులర్ అయ్యారు.ఇక ముద్దుగుమ్మ ఉపయోగించే “గుచ్సి“అనే కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ ధర1,34,048 రూపాయలు.
5) సాయి పల్లవి:
ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తక్కువ కాలంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి “లూయిస్ వీటన్“అనే కంపెనీ హ్యాండ్ బ్యాగ్ ను ఉపయోగిస్తున్నారు.ఈ బ్యాగ్ ధర ఏకంగా1,75,762 రూపాయలు.
6) కియారా:
మహేష్ బాబుతో జత కట్టి,భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత తెలుగులో రామ్ చరణ్ సరసన నటించారు.తెలుగులో ఈ రెండు సినిమాల్లో కనిపించిన కియారా బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అయితే కియారా వాడే హ్యాండ్ బ్యాగ్ “ఫెండి“కంపెనీ కు చెందినది.
ఈ బ్యాగ్ ధర ఏకంగా 3,67,307 రూపాయలు.
చూశారు కదా మన సినీ ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మలు ఎంత ఖరీదైనా హ్యాండ్ బ్యాగ్ లను ఉపయోగిస్తున్నారో.
నిజంగానే వీటి ధర ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.