ఈ నటి హీరోయిన్ అవుదామని సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందట... కానీ...

ఒక్కోసారి సినిమా పరిశ్రమలో మొహమాటానికి పోయి లేదా ఏ పాత్ర అయినా సరే నటించి పేరు తెచ్చుకోవాలని తీసుకున్న నిర్ణయాలే నటీనటుల జీవితాలని నిర్ణయిస్తుంటాయి.కాగా తమిళం, తెలుగు భాషలలో పలు చిత్రాలలో నటించి బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలతో కుర్రకారు గుండెల్లో పెంచేసిన ప్రముఖ తమిళ నటి సోనా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Tamil Actress Sona Facing Movie Offers Problems In Film Industry, Tamil Actress,-TeluguStop.com

అయితే అందరి లాగే నటి సోనా కూడా సినిమా పరిశ్రమకు హీరోయిన్ కావాలని వచ్చింది.కానీ అనుకోకుండా సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పలు  బి గ్రేడ్ ఫిలిమ్స్ మరియు బోల్డ్ తరహా పాత్రలో నటించే అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలో కాదనలేక కొన్ని చిత్రాలలో సోనా నటించింది.దీంతో మొదట్లో నటి సోనా  నటించిన పాత్రలే ఆమె సినీ జీవితాన్ని నిర్ణయించేశాయి.నటన పరంగా ఎంతో అనుభవం  మరియు ప్రతిభ  ఉన్నటువంటి సోనా కి ఇప్పటివరకు తన నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాకపోవడం కేవలం గ్లామర్ మరియు బోల్డ్ తరహా పాత్రలో నటించే అవకాశాలు మాత్రమే వరించాయి.కానీ పారితోషికం మాత్రం రోజుకి లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకునేది.

దీంతో నటన పరంగా పెద్దగా సంతృప్తి చెందకపోయినా డబ్బు పరంగా మాత్రం బాగానే సంపాదించుకునేది.ఈ క్రమంలో పలు చిన్న బడ్జెట్ తరహా చిత్రాలకి సహ నిర్మాతగా కూడా అప్పుడప్పుడు వ్యవహరించేది.

కాగా తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో నటి సోనా దాదాపుగా 100కి పైగా చిత్రాలలో నటించింది.కానీ ఇందులో ఎక్కువ శాతం చిత్రాలలో వ్యాంప్ మరియు బోల్డ్ తరహా పాత్రలో కనిపించింది.

అంతేగాక అప్పుడప్పుడు పలు స్పెషల్ సాంగ్స్ లో  కూడా కనిపించింది.కాగా ప్రస్తుతం తమిళంలో ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ లో ప్రసారం అవుతున్న ధారావాహికలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube