వైరల్: ఓకే తాటి చెట్టు పైకెక్కిన 17 మంది గీత కార్మికులు.. ఎందుకో తెలుసా..?!

తాటి చెట్టును ఎక్కడం చాలా కష్టం.ఎందుకంటే దాన్ని ఎక్కే క్రమంలో కొంచెం అటు ఇటు అయినాగానీ కింద పడితే ప్రాణాలు సైతం పోతాయి.

 Viral  Okay 17 Line Workers Climbing A Palm Tree Do You Know Why , Viral Latest,-TeluguStop.com

అసలు తాటి చెట్టు ఎందుకు ఎక్కుతారో మీకు తెలిసే ఉంటుంది.తాటి కల్లు పేరు వినే ఉంటారు కదా.బాగా ఫేమస్ ఇది.ఎంతో మంది తాటి కల్లును ఇష్టంగా తాగేవారు కూడా ఉన్నారు.అయితే ఈ తాటి చెట్టు నిండి తీసిన కల్లును కలెక్ట్ చేసుకోవడం కోసం తాటి చెట్టును ఎక్కుతారు.అయితే తాటి చెట్టు ఎక్కడం అనేది అందరికి కుదరని పని.బాగా అనుభవం ఉన్న గీత కార్మికులు మాత్రమే ఎక్కాలి.అయితే ఒక చెట్టు పై ఒకరు ఎక్కితేనే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాము.

అదే ఒకే చెట్టు పై ఏకంగా 17మంది ఎక్కితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.వినడానికే వింతగా ఉంది కదా.కానీ నిజంగానే ఒక తాటి చెట్టుపై 17 మంది ఎక్కారు.

అసలు వివరాలలోకి వెళితే.

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గౌడ కులస్తులు వాళ్ళ కులదేవత అయిన ఎల్లమ్మ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ పండుగ సందర్భంగా వారు నిర్వహించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచాయి.

వారి ఇలవేల్పు దైవం ఎల్లమ్మకు బోనాలు సమర్పించిన అనంతరం సామూహిక ఉత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా గౌడకులస్తులు మోకు, ముస్తాదులతో గ్రామంలో ర్యాలీ చేసారు.

తరువాత ఒకే తాటిచెట్టుపై 17మంది గీత కార్మికులు ఇలా మోకు, ముస్తాదులతో చెట్టుపైకి ఎక్కి సందడి చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.అంతేకాదు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కూడా తాటి చెట్టు ఎక్కడంలో పోటీ పడ్డారు.

వీరి ఆచారం ప్రకారం ఇలా ప్రతి ఏటా ఇలా చేస్తూ ఉంటారట.

ఇలా చేయడం వల్ల తమ కులదైవం గ్రామస్థులను చల్లగా చూస్తుందని వాళ్ళ విశ్వాసం.

అలాగే రాబోయే కాలంలో అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం వీరికి ఆనవాయితీగా వస్తోంది.దీంతో ప్రతి ఏటా మార్చి నెలలో ఈ ఉత్సవాన్ని పెద్ద పండుగలా చేస్తుంటారు.

ఆ ఊరులో ఉన్న మొత్తం గౌడ కులస్తులు అందరు కలిసి ఒక్క చోట చేరి వారి కుల దైవాన్ని పువ్వులతో ప్రత్యేకంగా అలంకరిస్తారు.అలాగే రోజంతా అమ్మవారికి పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు.

అందరు కలిసి ఒక్కచోట చేరి భోజనాలు కూడా చేస్తారు.అయితే ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పాలిసినది ఏదన్నా ఉంది అంటే అది అందరు కలిసి తాటి చెట్టు ఎక్కడమే అని చెప్పాలి.

ఇక్కడి యువకులు కూడా తాటి చెట్టు ఎక్కడానికి ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube