సీఎంకు అమితాబ్ మనవరాలు కౌంటర్.. అసలైమేందంటే..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి బాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు అమితాబ్ బచ్చన్.ఆయన మనవరాలు నవ్య నవేలీ నంద కూడా నెటిజన్లకు సుపరిచితమే.

 Navya Naveli Nanda Counter To Uttarakhand Cm About Ripped Jeans, Amithabachhan,-TeluguStop.com

తాజాగా నవ్య ఉత్తరాఖండ్ సీఎంకు ఒక విషయంలో కౌంటర్ ఇచ్చారు.సీఎంకు అమితాబ్ మనవరాలు కౌంటర్ ఇవ్వడం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజాగా ఉత్తరాఖాండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ యువతుల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

యువతులు టాన్ జీన్స్, రిప్పిడ్ జీన్స్ వేసుకోవద్దని సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

మోకాళ్లు కనిపించే విధంగా యువతులు రిప్పిడ్ జీన్స్ ను వేసుకుంటున్నారంటూ సీఎం విమర్శలు చేశారు.సీఎం చేసిన కామెంట్లకు కౌంటర్ గా నవ్య మా దుస్తులు మార్చాలని అనుకునే ముందు మీ ఆలోచనలను మార్చుకోండి అంటూ ఘాటు కౌంటర్లు ఇచ్చారు.

రిప్పిడ్ జీన్స్ లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు.

ప్రముఖ స్టార్ హీరో మనవరాలు సీఎంకే కౌంటర్లు ఇవ్వడంపై భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు నవ్యను సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం సీఎం చేసిన కామెంట్లలో తప్పేం లేదని అభిప్రాయపడుతున్నారు.గతంలో కూడా పలువురు రాజకీయ నాయకులు అమ్మాయిల దుస్తుల విషయంలో కామెంట్లు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం ఈ వివాదం విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Telugu Amithabachhan, Uttarakand Cm-Movie

సాధారణంగా సీఎంలు ఇలాంటి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారు. ఉత్తరాఖాండ్ సీఎం చేసిన కామెంట్ల విషయంలో ప్రతిపక్షాల నుంచి సైతం విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కొందరు నెటిజన్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉత్తరాఖాండ్ సీఎం కామెంట్ల విషయంలో వెనక్కు తగ్గుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube