మన్మధుడు2 ఫ్లాప్ నుంచి కోలుకున్న రాహుల్ రవీంద్రన్... గీతా ఆర్ట్స్ తో నెక్స్ట్...

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి ప్రయత్నంలోనే నటుడుగా ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్.ఈ యంగ్ హీరో మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు.

 Rahul Ravindran Plan To Third Movie, Bunny Vasu, Geetha Arts 2,  Rahul Ravindra-TeluguStop.com

హీరోగా అవకాశాలు వచ్చిన కూడా అనుకున్న స్థాయిలో హిట్స్ కొట్టలేక తన ఇమేజ్ ని కోల్పోయాడు.అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి కొన్ని సినిమాలలో నటించాడు.

ఇక లాభం లేదనుకొని మెగా ఫోన్ పట్టేసి దర్శకుడు అయిపోయాడు.దర్శకుడుగా అక్కినేని హీరో సుశాంత్ తో చిలాసౌ అనే సినిమా చేసి హిట్ కొట్టాడు.

ఈ సినిమాతో మంచి విషయం ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు.దీంతో రెండో సినిమాతో నాగార్జునని డైరెక్ట్ చేసే ఛాన్స్ రాహుల్ రవీంద్రన్ ని వచ్చింది.

ఓ రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా మన్మధుడు 2 సినిమాని తెరకెక్కించాడు.

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక అక్కడి నుంచి ఏ మాత్రం కోలుకోలేక భారీ నష్టాలని మిగిల్చింది.దీనికితోడు అసలు మన్మధుడు లాంటి క్లాసిక్ హిట్ మూవీ టైటిల్ పెట్టుకొని ఓ చెత్త సినిమా చేశారంటూ విమర్శలు వినిపించాయి.

ఈ సినిమా దెబ్బతో కొంత కాలం రాహుల్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు.అయితే రెండేళ్ళ గ్యాప్ తర్వాత మరల ఇప్పుడు ఆ ఫ్లాప్ మూడ్ నుంచి కోలుకొని కొత్త సినిమాకి ఈ హీరో కమ్ దర్శకుడు శ్రీకారం చుడుతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడుకి గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాస్ అవకాశం ఇచ్చాడు.రీసెంట్ గా అతను చెప్పిన కథ విని బన్నీ వాస్ ఒకే చేసినట్లు తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమాకి సంబందించిన అన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube