నాగ చైతన్యతో రొమాన్స్ చేయబోతున్న ఇస్మార్ట్ బ్యూటీ...

ఇస్మార్ట్ బ్యూటీగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నభా నటేష్.ఈ భామకి హిట్స్ పెద్దగా రాకున్న అవకాశాలు అయితే భాగానే వస్తున్నాయి.

 Nabha Natesh Romance With Naga Chaitanya-TeluguStop.com

ప్రస్తుతం నభా వరుణ్ తేజ్ కి జోడీగా గని సినిమాలో నటిస్తుంది.ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని నభా సొంతం చేసుకుందని తెలుస్తుంది.

ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై సంగం కంప్లీట్ అయ్యింది.

అయితే ఇందులో హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంత వరకు రివీల్ చేయలేదు.అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఇందులో చైతూకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది.

Telugu Nabha Natesh, Naga Chaitanya, Tollywood, Vikram Kumar-Movie

ఇక వారిలో ఒక హీరోయిన్ గా నభా నటేష్ ని ఫైనల్ చేశారని, ఆమె ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొందని టాక్ వినిపిస్తుంది.ఇక మరో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక పాత్ర కోసం కొత్త మోడల్ ని పరిచయం చేస్తున్నారని తెలుస్తుంది.ఇందులో చైతన్య మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపిస్తాడని, వాటికి తగ్గట్లు ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తుంది.ఇక నాభా నటేష్ ప్రస్తుతం వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు నితిన్ అందాధున్ రీమేక్ లో కూడా నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.మొత్తానికి కెరియర్ పరంగా సరైన సక్సెస్ లేకపోయినా నభా చేతిలో మూడు సాలిడ్ సినిమాలు ఇప్పుడు ఉన్నాయి.వీటితో అయిన ఈ బెంగుళూరు భామకి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube