భారత్ బంద్‌కి పిలుపునిచ్చిన రైతులు.. ఎప్పుడంటే.. ?

దేశంలో కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ప్రజల్లో సెగలుపుట్టిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే అధికధరలతో కేంద్రం సామాన్యుల నడ్దివిరవగా, నొప్పి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను దోచుకుంటున్నాయనే టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే పేదలు పూట పూటకు ఆహారం కోసం అష్టకష్టాలు పడుతున్నారట.

 Farmers Call For Bharat-TeluguStop.com

అదీగాక కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న విషయం తెలిసిందే.రైతుల ఉద్యమానికి దేశ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.

ప్రతిపక్ష పార్టీలతో పాటు పలువురు సెలబ్రెటీలు రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

ఇప్పటికే రైతు ర్యాలిలో అపశ్రుతులు కూడా చోటుచేసుకుని విద్వంసానికి దారి తీయగా కేంద్రం మాత్రం నిమ్మకు నిరెత్తినట్టుగా ప్రవర్తిస్తుంది.

ఈ నేపద్యంలో రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 26న భారత్ బంద్‌కి రైతులు పిలుపునిచ్చారు.

ఈ విషయాన్ని రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube