తెలంగాణలో స్కూళ్లు కాలేజీల పై ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశంలో కరోనా మళ్లీ నల్లిలా ప్రవర్తిస్తున్న క్రమంలో ముఖ్యంగా విద్యార్ధుల విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిందట.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.

 Government Decides On Schools And Colleges In Telangana Colleges ,corona Cases,-TeluguStop.com

ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు స్కూళ్లలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 35 మంది విద్యార్థినులకు, కామారెడ్డి జిల్లాలోని టేక్రియాల్ కస్తూర్భా పాఠశాలలో 32 మందికి, నాగోల్ బండ్లగూడ లోని తెలంగాణ మైనారిటీ గర్ల్స్ హైస్కూలులో 36 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

దీంతో అప్రమత్తం అయిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో పరిస్దితి అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో విద్యాసంస్థలను నడపాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.ఇకపోతే తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube