పులిహోరను ప్రసాదంగా పెట్టడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా..?

సాధారణంగా మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా పులిహోర పెట్టడం మనం చూస్తుంటాము.పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.

 Do You Know The Reason Behind Making Pulihora A Delicacy, Bheemudu, Hindu Purana-TeluguStop.com

ఇప్పటికీ కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో పులిహోర ప్రసాదం ఎంతో ఫేమస్.చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు.

దేవాలయంలో, మన ఇంట్లో ప్రత్యేక పూజ సమయంలోనూ పులిహోర దేవుడికి నైవేద్యంగా సమర్పించడం మనం చూస్తుంటాము.ఈ విధంగా పూజల సమయంలో పులిహోరకి ఎంతో ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? పురాణాల ప్రకారం భీముడు వంటవాడి వేషం ధరించి వివిధ రకాల వంటలను తయారుచేస్తారు.అందులో ఒకటి ఈ పులిహోర.ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పులిహోరకు దక్షిణ భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది.

కర్ణాటక, తమిళనాడు ప్రజలు చోళుల కాలంలో దేవుళ్లకు నైవేద్యంగా పండ్లు, పువ్వులను సమర్పించేవారు.ముఖ్యంగా శ్రీ వైష్ణవులు,అయ్యంగార్లు ప్రత్యేక పూజలు సమయంలో స్వామివారికి ప్రసాదంగా పులిహోరను సమర్పించేవారు.

ఆ విధంగా అప్పటి నుంచి ఇతర ప్రజలు కూడా దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించడం ఒక ఆచారంగా వస్తోంది.సాధారణంగా పసుపు రంగును మన హిందూ సాంప్రదాయాలలో శుభ సూచకంగా పరిగణిస్తాము.

అదే విధంగా పులిహోర కూడా పసుపు రంగులో ఉండటం వల్ల ఈ పులిహోరను దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు.

Telugu Bheemudu, Hindu Puranas, Karnataka, Pooja, Pulihora, Srivenkateswara, Tam

ఈ విధంగా పులిహోర ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగా ఎంతో శుభదాయకం అని పండితులు సైతం చెబుతున్నారు.ఇప్పటికీ కలియుగ దైవమైన సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి పులిహోరను మొత్తం రాశిగా పోసి ఆ శ్రీహరికి సేవ చేస్తారు.ఈ సేవనే తిరుప్పావడ సేవ అని పిలుస్తారు.

అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రముఖ ఆలయాలలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా, భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు.ఈ పులిహోర ప్రసాదాన్ని కొందరు చింతపండుతో తయారు చేయగా, మరికొందరు నిమ్మకాయలతో తయారుచేస్తుంటారు.

చిన్న పిల్లలు సైతం పులిహోర తినడానికి ఎంతో ఇష్టపడుతుంటారు.ఈ విధంగా పులిహోర ప్రసాదంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube