దర్శకుడు నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ మీకు తెలుసా..?

దర్శకుడిగా తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు నాగ్ అశ్విన్ .నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎవడే సుబ్రమణ్యం అబవ్ యావరేజ్ గా నిలవగా మహానటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.

 Director Nag Ashwin  Reveals His Love Story With Priyanka Dutt, Priyanka Dutt, D-TeluguStop.com

నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన జాతిరత్నాలు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది.నాగ్ అశ్విన్ తరువాత సినిమా ప్రభాస్ హీరోగా తెరకెక్కనుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఆ సినిమా విడుదల కానుంది.

అయితే జాతిరత్నాలు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ ప్రియాంక దత్ తో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు.2015 సంవత్సరంలో ప్రియాంక దత్, నాగ్ అశ్విన్ వివాహం జరగగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోక ముందే ప్రియాంక దత్ అతనిని వివాహం చేసుకోవడం గమనార్హం.అయితే వీళ్లిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైందనే విషయం చాలామందికి తెలియదు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో స్పందించి ఈ విషయాలను వెల్లడించారు.

Telugu Nag Ashwin, Nagashwin, Love Story, Jathi Rathnalu, Priyanka Dutt-Movie

ప్రొఫెషనల్ గా నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ కొన్ని యాడ్స్ కోసం పని చేయగా ఆ సమయంలోనే వీళ్లిద్దరికి ఏర్పడింది.నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రమణ్యం సినిమాకు ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు.ప్రియాంక దత్ కు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో నాగ్ అశ్విన్ ప్రియాంకకు ఎవరైతే నచ్చితే ఓకే అని లేకపోతే మనం పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ పెట్టారు.

Telugu Nag Ashwin, Nagashwin, Love Story, Jathi Rathnalu, Priyanka Dutt-Movie

నాగ్ అశ్విన్ మంచి వ్యక్తి కావడం, అతని టాలెంట్ పై అపారమైన నమ్మకం ఉండటంతో ప్రియాంక దత్ కూడా వెంటనే ఓకే చెప్పేశారు.అలా నాగ్ అశ్విన్ ప్రేమ, పెళ్లి జరిగాయి.ఆ తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా సక్సెస్ కావడం ఆ సినిమాకు అవార్డులు రావడం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube