సంతాన సమస్యలకు అదే కారణమా..?

ప్రస్తుత  రోజుల్లో చాలా మంది దంపతులు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో సంతానలేమి సమస్య కూడా ఒకటి.ఎన్నో జంటలు పిల్లలు లేని కారణంగా ఐయూఎఫ్, ఐవీఎఫ్, సరోగసి వంటి తదితర విధానాల ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Is It The Same Cause Of Birth Problems, Pelvic Tb, Pragancy Problems, Pregant, H-TeluguStop.com

కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినాగాని, డబ్బులు పోతున్నాయో తప్పా పిల్లలు పుట్టడం లేదు.  అసలు కొంతమందిలో ఏ కారణం చేత సంతానం కలగడం లేదో కూడా కనిపెట్టలేకపోతున్నారు.

ఎన్నో రకాల అత్యాధునిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులో ఉన్నాగాని చాలా మందిలో సంతానలేమికి గల సమస్యకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోలేకపోతున్నారు.అయితే, కొందరిలో సంతాన సమస్యలకు పెల్విక్ ట్యూబేర్కలోసిస్ (కటి క్షయ) కూడా ప్రధాన కారణమని వైద్యులు తెలుపుతున్నారు.

అయితే ఇది సాధారణ పరీక్షల్లో తెలుసుకోలేమని అంటున్నారు వైద్యులు.కేవలం హిస్టెరోస్కోపీ లేదా గర్భాశయ పరిశీలన, బయోప్సీ ద్వారా మాత్రమే దీన్ని గుర్తించగలమన్నారు.

గర్భాశయానికి, దాని ఇరువైపులా ఉన్న నాళాలకు, గర్భాశయం ముఖద్వారం, గర్భాశయ వెలుపల ఉండే యోని భాగానికి క్షయ వ్యాధి సోకడాన్ని జననేంద్రియ క్షయ అని అంటారు.ఇండియా జర్నల్ ఆఫ్ ట్యుబర్‌క్యులోసిస్ నివేదిక ప్రకారం.

ఈ జననేంద్రియ క్షయ వ్యాధి సమస్య ఎక్కువగా మహిళల్లోనే ఉంటుందని చెప్తున్నారు.దేశంలో సంతాన సాఫల్య కేంద్రాలకు వస్తున్న 5 నుంచి 13 శాతం మహిళలు పెల్విక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.

ఈ టీబీ వల్ల సంతాన లేమి సమస్యలు ఏర్పడతాయి.అంతేకాకుండా ఈ టీబీ వ్యాధి శరీరంలోని ఏ అవయవానికైనా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు .అలాగే ఈ వ్యాధి వచ్చిన వెంటనే వ్యాధి లక్షణాలను గుర్తించడం కూడా చాలా కష్టం అంట.అలా అని ఈ టీబీని ప్రారంభ దశలో కనిపెట్టడం కూడా కష్టమేనని తెలుపుతున్నారు.

సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే మాత్రం లాప్రోస్కొపీ, జననేంద్రియాల స్కానింగ్ టెస్ట్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.ఇలా టెస్ట్ చేయించుకుంటే ప్రారంభ దశలోనే కనిపెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

సాధారణంగా ఈ వ్యాధికి యూటిరిన్ ట్యూబ్స్ అధికంగా లోనవుతాయి.ఒక్కోసారి క్షయ వ్యాధి రెండువైపులా ఉన్న ట్యూబ్స్ కి కూడా సోకవచ్చు.

దీనితో ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ కి లోనవుతాయి.క్రమంగా ట్యూబ్స్ గోడలు మందంగా అయ్యి క్షీణ దశకు వస్తాయి.

ఫలితంగా నెలసరులు సక్రమంగా వచ్చిన పిల్లలు మాత్రం పుట్టరు.అందుకనే ఎన్ని ప్రయత్నాలు చేసిన సంతానం కలగకపోతే తప్పకుండా ఈ జననేంద్రియ టీబీను గుర్తించే వైద్య పరీక్షలు చేయించుకోవడం మర్చిపోకండి.!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube