బ్రెయిన్ హెమరేజ్‌తో ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. !

ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్‌పి జననాధన్ ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు.నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అయిన ఎస్‌పి జననాధన్ 2003లో ‘డ్రామా ఇయార్కయి’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా సినీ కెరియర్ ప్రారంభించి తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు.

 Tamil Director Sp Jananathan Died Of Cardiac Arrest This Morning, Tamil Director-TeluguStop.com

‘ఈ – ది బయో వార్, పెరాన్మై, పురంపొక్కు ఎంగిర పొదువుదమై’ చిత్రాల ద్వారా తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా మారిన జననాధన్ ప్రస్తుతం విజయ్ సేతుపతి తో కలిసి ‘లాభం’ చిత్రాన్ని చేస్తున్నారు.కాగా ఈ మూవీ ఎడిటింగ్ వర్క్ జరుగుతున్న క్రమంలోనే బ్రెయిన్ హెమరేజ్‌తో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇతని ఫ్యామిలీ.

కానీ దురదృష్టవశాత్తు డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌కు స్పందించని దర్శకుడు ఆదివారం తుదిశ్వాస విడిచారు.ఇకపోతే ఎస్‌పి జననాధన్ మరణంతో దిగ్భ్రాంతికి గురైన కోలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు నివాళి అర్పిస్తూ, జననాధన్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube