ఈ ఆలయ ప్రత్యేకతే వేరు... అగ్నిగుండంలో ఆ రెండు సమర్పిస్తే..?

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన, ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన ఆలయాలను దర్శించడానికి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.

 The Uniqueness Of This Temple Is That If The Two Are Offered In A Fire Pit, Temp-TeluguStop.com

అందుకు గల కారణం స్వామివారిపై భక్తులకున్న ప్రగాఢ విశ్వాసం.ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తులలో నమ్మకం ఉండటం వల్ల పెద్ద ఎత్తున అలాంటి ఆలయాలను సందర్శిస్తుంటారు.

ఇటువంటి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న ఆలయానికి చెందినదే అనంతపురం జిల్లాలోని అమరాపురం మండలం హేమావతి గ్రామంలో మానవ రూపంలో వెలసిన పరమేశ్వర ఆలయం అని చెప్పవచ్చు.అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ గ్రామంలో వెలసిన పరమేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో అగ్నిగుండం ఏర్పాటు చేస్తారు.

అగ్ని గుండంలో భక్తులు ధాన్యం, ధూపం సమర్పించడంవల్ల వారికి పంటలు మరింత రెట్టింపు అవుతాయని భావిస్తారు.అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలు సైతం తొలగిపోతాయని విశ్వసిస్తారు.

మన దేశంలో చాలా చోట్ల శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తే, ఇక్కడ మాత్రం మానవ రూపంలో దర్శనమిస్తాడు.మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ ఆలయంలో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగానే రెండవ రోజు స్వామివారి సన్నిధి నందు అగ్నిగుండం ఏర్పాటు చేస్తారు.అగ్నిగుండంలో భక్తులు పంటలను, ధూపాన్ని స్వామివారికి ఆహుతిగా సమర్పించడం వల్ల వారి పంటలు మరింత దిగుబడి సాధిస్తాయని రైతుల నమ్మకం.

బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి రావడం ఎంతో విశేషమని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube