ఏపీలో కరోనా కిరికిరి.. రెడ్ జోన్ ప్రకటించిన అధికారులు.. ?

కంటికి కనిపించే శత్రువు కంటే కనిపించని శత్రు చాలా డేంజర్ అంటారు.కరోనా కూడా ఉగ్రవాదుల కంటే దారుణంగా మారుతుంది.

 Chittoor Municipal Officials Declared Red Zone As Two Students Tested Corona Pos-TeluguStop.com

రోజు రోజుకు తన పరిధిని పెంచుకుంటూ ప్రజల్లో తిష్టవేస్తుంది.ఇప్పటికే దేశంలో కరోనా కేసులు మళ్లీ వింజృంభిస్తుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో కూడా కరోనా వైరస్ కుదుపులు మొదలవడంతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం రెడ్ జోన్ ప్రకటించింది.

ఇందులో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు కరోనా పాజిటివ్ నమోదైన చోట్లలో మళ్లీ రెడ్ జోన్ విధించారు.

ఈ క్రమంలో నగరం లోని కేశవరెడ్డి పాఠశాల, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైరస్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.వారం రోజుల పాటు పాఠశాల మూసి వేయాల్సిందిగా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా పాఠశాల, కళాశాల వద్ద రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube