యుట్యూబ్ లో వంద కోట్ల వ్యూస్ క్రాస్ చేసిన రౌడీ స్టార్ ఫ్లాప్ మూవీ

టాలీవుడ్ లో రౌడీ స్టార్ విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వరుస హిట్స్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

 World Famous Lover Hindi Dubbing Cross 100 Million Views, Tollywood, South Cinem-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమా ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది.2019లో విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగులో డిజాస్టర్ అయ్యాయి.మంచి కంటెంట్ ఉన్న స్క్రీన్ ప్లే లో ఉన్న కన్ఫ్యూజన్ కారణం ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

అయితే ఈ రెండింటికి హిందీలో డబ్బింగ్ చేసి యుట్యూబ్ లో రిలీజ్ చేశారు.వీటిలో డియర్ కామ్రేడ్ ఇప్పటికే హిందీ డబ్బింగ్ వెర్షన్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు థియేటర్ లో డిజాస్టర్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి సోషల్ మీడియా విపరీతమైన వ్యూస్ వచ్చాయి.ఏకంగా ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్ లో వంద మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది.అలాగే సినిమాకి 1.9 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి.ఈ సినిమాకి వచ్చిన వ్యూస్ బట్టి బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఈ నేపధ్యంలో రౌడీ స్టార్ ఇకపై తాను చేయబోయే సినిమాలు తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకే సారి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే లైగర్ సినిమాతో బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తున్న విజయ్ కి థియేటర్ లో ఏ రేంజ్ లో వెల్ కమ్ లభిస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube