1.కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినా, టీఆర్ఎస్ ఎంపీలు ముఖం చాటేశారు అంటూ లేఖలో ఘాటుగా విమర్శించారు.
2.టీడీపీ మాజీ మంత్రి అరెస్ట్
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు.
3.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.ఇగ్నో లో బీఎస్సీ నర్సింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నొ ) జనవరి 2021 అడ్మిషన్ల లో భాగంగా మేనేజ్మెంట్ బిఎస్సి నర్సింగ్ , బీఈడీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఈ నెల 20 లోపు ఎన్నో వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు ఫయాజ్ అహ్మద్ కోరారు.
5.17 న ఏపీలో అత్యున్నతస్థాయి కమిటీ భేటీ
రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యుల నియామకం ఈ నెల 17న అత్యున్నత స్థాయి కమిటీ భేటీ ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరగనుంది.
6.కొత్తగా మరో 57 మంది పేద విద్యార్థులకు కరోనా
తిరుమలలోని లో చదువుతున్న మరో 57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది.
7.వ్యాక్సిన్ సర్టిఫికెట్స్ లో మోది ఫోటో తొలగింపు

కోవిడ్ 19 వాక్సినేషన్ సర్టిఫికెట్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది.పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసొమ్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ల లో మోదీ ఫోటో ను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.
8.సైనిక్ స్కూల్ పై రాష్ట్ర సర్కార్ స్పందించడం లేదు : కేంద్రం
సైనిక్ స్కూల్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర సహాయ మంత్రి శ్రీకాంత్ నాయక్ వెల్లడించారు.
9.దేశంలో కొత్తగా ఎనిమిది సైనిక్ స్కూళ్లు
దేశంలో మొత్తం 33 సైనిక్ స్కూల్ ఉన్నాయని మరో ఎనిమిది సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ పాద నాయక్ వెల్లడించారు.
10.తిరుపతి రేణిగుంట మీదుగా 45 ప్రత్యేక రైళ్లు

కరోనా నేపథ్యంలో తిరుపతి, రేణిగుంట లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో 2045 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్రం తెలిపింది.
11.ఏడుపాయల జాతర ప్రారంభం
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసాన్పల్లి లో ఏడుపాయల జాతర గురువారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది.
12.నాగపూర్ లో లాక్ డౌన్

మహారాష్ట్రలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు.తాజాగా నాగ్ పూర్ లో కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
13.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 22,854 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.ఈ మెయిల్ హ్యాకర్ల ముఠా గుట్టు రట్టు
ఇటీవల కర్ణాటక మాజీ డీజీపీ శంకర్ బిధిరి ఈమెయిల్ హ్యాక్ అయ్యింది.మిత్రులు ఆయన అడిగారని భావించి 25 వేలు జమ చేశారు.ఈ విషయం తెలిసిన శంకర్ బిదిరి ఆగ్నేయ విభాగం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
15.కీలక అనుచరులతో షర్మిల సమావేశం

త్వరలోనే కొత్త పార్టీ స్థాపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వైఎస్ షర్మిల కీలక నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ నెల 16 లోపు కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డి కి బాధ్యతలు అప్పగించారు.
16.స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీసు
స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు.
17.బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు కన్నుమూత
బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు దాది హృదయ మోహిని (93) అనారోగ్యంతో కన్ను మూశారు.
18.కొల్లు రవీంద్ర కు బెయిల్ మంజూరు
పోలీసులపై దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు బెయిల్ మంజూరు అయ్యింది.
19.బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకున్న దేత్తడి హారిక

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు దేత్తడి హారిక ప్రకటించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 42,150
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,980
.