ఎలన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్ కు ఎన్ని కోట్లంటే?

నిరంతరం జాతీయ, అంతర్జాతీయ విషయాలను ఫాలో అయ్యే వారికి ఎలాన్ మస్క్ పేరు తెలిసే ఉంటుంది.టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో నెంబర్ వన్ కుబేరుడు ఎలన్ మస్క్.

 How Many Crores For Alan Musk Girlfriend Painting Elan Mask, Viral News, Viral N-TeluguStop.com

అతను ఎంత శక్తివంతమైన వ్యక్తి అనేది వాట్సాప్ వివాదం అప్పుడు చూసాం.వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీలను వ్యతిరేకిస్తూ, తన ట్విట్టర్ అకౌంట్ లో జస్ట్ యూస్ సిగ్నల్ అని చెప్పి ట్వీట్ చేస్తే అప్పటివరకు బడా వ్యాపారవేత్తలు మాత్రమే వాడే సిగ్నల్ యాప్ ఒక్కసారిగా అది పాపులర్ అయిపోయింది.

డౌన్ లోడ్స్ ఎక్కువ అవడం వల్ల యాప్ సర్వర్ డౌన్ అయిందంటే ఎలన్ మస్క్ ఎంత శక్తివంతమైన వ్యక్తి అనేది మనం అర్ధం చేసుకోవచ్చు.

టెస్లా పేరుతో వచ్చే కార్లలో అద్భుతమైన టెక్నాలజీని పరిచయం చేస్తూ ఆటో మొబైల్ రంగంలో ఒక దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగి పోయాడు.

అయితే ఎలన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.ఎలన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ గ్రైమ్స్ స్వతహాగా ఒక పెయింటర్.అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ పెయింటింగ్ కు పలికిన ధర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.అయితే ఆమె వేసిన పెయింటింగ్ ను వేలం వేస్తున్నట్టు ప్రకటించగానే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.20.నిమిషాల వ్యవధిలోనే 5.8 మిలియన్ డాలర్లను అంటే మన భారత కరెన్సీలో 42 కోట్లకు అమ్ముడయింది.అయిదే ఈ ఆర్ట్ లోని ప్రత్యేకత ఏంటంటే మార్స్ ను ఓ బేబీ రక్షిస్తున్నట్టుగా కళ్ళకు కొట్టచ్చినట్టు కనబడుతోంది.

అయితే ఎలాన్ మస్క్, గ్రైమ్స్ సంతానం అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా గ్రైమ్స్ పెయింటింగ్ పలికిన ధరను చూసి అందరు అవాక్కవుతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube