అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్.. ముగ్గురు హీరోలతో సినిమాలు..?

పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఐదు సినిమాలు తెరకెక్కగా ఐదు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఎఫ్3 సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ అని అందరూ భావిస్తుండగా ఈ సినిమా సీక్వెల్ కాదని అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

 Anil  Ravipudi Super Planning About Further Movies , Anil Ravipudi, Balakrishna,-TeluguStop.com

అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న గాలిసంపత్ సినిమా ఈ నెల 11న విడుదల కానుండగా అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ట్రైలర్ లోనే ఈ సినిమా కథను చెప్పేశామని రాజేంద్ర ప్రసాద్ చేసే కామెడీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందని తెలిపారు.అరకు బ్యాక్ డ్రాప్ లో గాలి సంపత్ సినిమా తెరకెక్కిందని అరకు అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని అనిల్ రావిపూడి తెలిపారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Gali Sampath, Hrithik Roshan, Mahesh Babu, Ra

సత్య మంచి కమెడియన్ అని.అతని కామెడీ టైమింగ్ బాగుంటుందని అనిల్ రావిపూడి తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని.ఎఫ్ 3 మూవీలో ఎఫ్ 2ను మించి నవ్వులు ఉంటాయని అనిల్ రావిపూడి అన్నారు.డబ్బు లేకపోతే వచ్చే ఫ్రస్టేషన్ ను ఎఫ్ 3 లో ప్రధానంగా చూపించబోతున్నామని అనిల్ రావిపూడి తెలిపారు.తన భవిష్యత్తు సినిమాలు మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ తో ఉంటాయని అనిల్ రావిపూడి అన్నారు.

బాలకృష్ణకు ఇప్పటికే కథ చెప్పానని.ఆ కథకు బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని అన్నారు.తన సినిమాల్లో పటాస్ మూవీని హృతిక్ రోషన్ తో రీమేక్ చేస్తానని అనిల్ రావిపూడి తెలిపారు.హృతిక్ ఇలాంటి సినిమాల్లో నటిస్తే కొత్తగా ఉంటుందని అనిల్ రావిపూడి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube