కేజీఎఫ్ హీరో తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య వివాదం.. ఏమైందంటే..?

స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీతో పాటు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సంగతి విదితమే.కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తెరకెక్కుతుండగా కేజీఎఫ్ 2 మూవీపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను నిర్మాతలు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు తీసుకుని విడుదల చేస్తున్నారు.2021 సంవత్సరం జులై 16వ తేదీన ఈ సినిమా విడుదలకానుంది.

 Fight Between  Villagers And Kannada Kgf Actor Yash Family In Hassan , Kgf Hero,-TeluguStop.com

కేజీఎఫ్ హీరో యశ్ కు తెలుగులో క్రేజ్ ఏర్పడటంతో గతంలో యశ్ నటించిన కన్నడ చిత్రాల హక్కులను తెలుగు నిర్మాతలు కొనుగోలు చేసి వాటిని డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్నారు.అయితే తాజాగా యశ్ తల్లిదండ్రులు ఒక వివాదంలో చిక్కుకున్నారు.

వ్యవసాయ భూమి విషయంలో గ్రామస్తులకు యశ్ తల్లిదండ్రులకు మధ్య ఈ వివాదం నెలకొంది.పూర్తి వివరాల్లోకి వెళితే హసన్ జిల్లాలోని తిమ్మెనహల్లి గ్రామంలో యశ్ కు సొంతంగా వ్యవసాయ క్షేత్రం ఉంది.

Telugu Farm Road, Kgf, Prashant Neel, Prashanth Neel, Villagers, Yash-Movie

యశ్ యొక్క పొలానికి వేసే రహదారి విషయంలో యశ్ కు, గ్రామస్తులకు మధ్య వివాదం నెలకొందని తెలుస్తోంది.చిన్నగా మొదలైన ఈ వివాదం పెద్దగా మారింది.అయితే యశ్ వీరాభిమానులు కొందరు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.తిమ్మెనహల్లి గ్రామస్తులు పొలానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారిని నిర్మించకూడదని కోరుతుండటం గమనార్హం.

చివరకు ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లగా పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. రహదారి వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యశ్ కు ఇలాంటి చిన్నచిన్న వివాదాలు నెగిటివ్ ఇమేజ్ ను తెచ్చిపెడుతున్నాయి.మరోవైపు కేజీఎఫ్ 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube