హీరో శ్రీ విష్ణు భార్య, కూతురిని ఎప్పుడైనా చూసారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు సాగర్కే చంద్ర దర్శకత్వం వహించిన “అప్పట్లో ఒకడుండేవాడు” అనే చిత్రంలో రెండో హీరోగా నటించి టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ హీరో “శ్రీ విష్ణు” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా  తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే శ్రీ విష్ణు ఈ చిత్రంలో హీరోగా నటించదానికంటే ముందుగా నందమూరి హీరో నారా రోహిత్ హీరోగా నటించిన “బాణం” అనే చిత్రంలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాడు.

 Telugu Hero Sree Vishnu Wife And Daughter News, Telugu Hero Sree Vishnu, Prashan-TeluguStop.com

ఆ తర్వాత  అల్లు అర్జున్, రానా తదితర స్టార్ హీరోల చిత్రాల్లో కూడా కనిపించాడు.నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి శ్రీ విష్ణు కి ఇప్పటి వరకు తన నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదని చెప్పాలి.

అయితే శ్రీ విష్ణు భార్య ,కుటుంబం గురించి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…

అయితే శ్రీ విష్ణు భార్య పేరు ప్రశాంతి ముళ్లపూడి.ఈమెని శ్రీ విష్ణు 2013వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు.

 అయితే ప్రశాంతి ముళ్లపూడి తల్లిదండ్రులు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ బాగానే సెటిల్ అయ్యారు.కాగా ప్రస్తుతం వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.

 ఆమె పేరు మ్రిధ… చిన్నప్పటి నుంచి శ్రీ విష్ణు కి సినిమాల పట్ల, స్పోర్ట్స్ పట్ల చాలా ఆసక్తి ఉండేది. అందువల్లనే గతంలో శ్రీ విష్ణు ఆంధ్రప్రదేశ్ తరఫున  అండర్ 19 క్రికెట్ జట్టులో కూడా ఆడాడు.

ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ కి వచ్చాడు.అయితే అప్పట్లో శ్రీ విష్ణు మరియు ప్రశాంతిల పెళ్లి కి టాలీవుడ్ హీరో నారా రోహిత్ సహాయం చేశాడట.

అందువల్లే శ్రీ విష్ణు కి నారా రోహిత్ మంచి స్నేహితుడని అంతేగాక శ్రీ విష్ణు హీరోగా నటించిన పలు చిత్రాలకు నారా రోహిత్ ఫైనాన్షియర్ గా వ్యవహరించాడని కూడా కొందరు చర్చించుకుంటున్నారు. ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు నారా రోహిత్ గురించి మాట్లాడుతూ తనకి సినిమా పరిశ్రమలో ఉన్న ఏకైక స్నేహితుడు నారా రోహిత్,  అంతేగాక నారా రోహిత్ షూటింగుల నిమిత్తం లేదా పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్ళినప్పుడు తన కోసం కూడా షాపింగ్ చేస్తుంటాడని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా శ్రీ విష్ణు ఆ మధ్య  “తిప్పరా మీసం” అనే చిత్రంలో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 దీంతో శ్రీ విష్ణు తన తదుపరి చిత్ర కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.  కాగా ప్రస్తుతం “గాలి సంపత్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న శ్రీ విష్ణు ఎలాగైనా సరే “గాలి సంపత్” చిత్రంతో హిట్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నాడు.

అలాగే ఇటీవలే ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “రాజ రాజ చోర” అనే టాలీవుడ్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube