బ్లూబెర్రీస్‌తో ఇలా చేస్తే..చర్మం పట్టులా మెరవాల్సిందే?

ఆరోగ్య వంత‌మైన పండ్ల‌లో బ్లూ బెర్రీస్ ఒక‌టి.పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్ట‌ప‌డే బ్లూ బెర్రీస్‌లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రీటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

 Beauty Benefits Of Blueberries Beauty, Benefits Of Blueberries, Blueberries, Blu-TeluguStop.com

అటువంటి బ్లూ బెర్రీస్ ఆరోగ్య ప‌రంగానే కాకుండా.సౌంద‌ర్య ప‌రంగా కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

ముఖ్యంగా చ‌ర్మ కాంతిని పెంచ‌డంలోనూ, ముఖాన్ని మృదువుగా మార్చ‌డంలోనూ, మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ బ్లూ బెర్రీస్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి బ్లూ బెర్రీస్‌ను చ‌ర్మానికి ఎలా యూస్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Benefits, Face Pack, Face, Skin, Skin Care-Telugu Health - తె�

ముందుగా కొన్ని బ్లూ బెర్రీస్‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా పుదీనా ఆకుల ర‌సం మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మొటిమ‌లు, న‌ల్ల‌టి మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌ట్టి ముఖం కాంతివంతంగా మారుతుంది.

Telugu Tips, Benefits, Face Pack, Face, Skin, Skin Care-Telugu Health - తె�

అలాగే బ్లూ బెర్రీస్‌ను మెత్త‌గా పేస్ట్ చేసుకుని అందులో ముల్తానీ మ‌ట్టిని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఇలా డే బై డే చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత‌క‌ణాలు, మురికి పోయి చ‌ర్మం ప‌ట్టులా మెరుస్తుంది.

ఇక ఒక బౌల్‌లో బ్లూ బెర్రీస్ పేస్ట్ తీసుకుని అందులో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి పావు గంట పాటు డ్రై అర‌నివ్వాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్‌ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే ముడ‌త‌లు పోయి ముఖం య‌వ్వ‌నంగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube