విరాటపర్వంలో మహిళా పాత్రలు ఎంత గొప్పవో తెలుసా?

బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రానా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది.ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో రానాకు కూడా అంతే పేరు వచ్చింది.

 Womens Day Gift From Rana Virata Parvam Movie, Rana, Sai Pallavi, Virata Parvam,-TeluguStop.com

ఈ సినిమా తర్వాత రానా వరస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు.ప్రస్తుతం రానా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కామ్రేడ్ రావన్న జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో రానాకు జంటగా సాయి పల్లవి నటిస్తుంది.

ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యినా కరోనా కారణంగా ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు.

ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా రివ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్ అని పెట్టారు.

అయితే ఈ రోజు మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భంగా ఇందులో నటిస్తున్న మహిళా నటీమణుల గురించి ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసారు.ఇప్పుడు ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.ఈ వీడియోలో సినిమాలో నటించిన మహిళా పాత్రల గొప్పతనాన్ని వివరిస్తూ రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

సినిమాలో నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, సాయి చంద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది.

ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో ఒక భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది.మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని నమ్మిన విప్లవం తనది… అడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీరు ప్రతి రూపాలు.

వీళ్ళ మార్గం అనన్యం.అసామాన్యం.

లెట్స్ సెల్యూట్ టు ఆల్ గ్లోరియస్ ఉమెన్స్.అంటూ రానా చెప్పిన వాయిస్ కు గూస్ బంప్స్ వస్తున్నాయి.

ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube