స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా..అయితే బ‌రువు పెర‌గ‌డం ఖాయం!

నేటి ఆధునిక కాలంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ టాప్లు, టీవీల‌తోనే స‌మ‌యం గ‌డుపుతూ నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నారు.రేపు అనేది లేదన్నట్లుగా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటూ గేమ్స్ ఆడ‌టం, సినిమాలు చూడ‌టం, చాటింగ్లు చేయ‌డంతోనే నిద్ర స‌మ‌యాన్ని వృధా చేస్తున్నారు.

 Neglecting Sleep Can Lead To Weight Gain! Neglecting Sleep, Weight Gain, Over We-TeluguStop.com

నిజానికి నిద్ర మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం.ఆహారం లేకున్నా కొన్ని రోజులు ఉండ‌గ‌ల‌రు.

కానీ, నిద్ర లేకుంటే మాత్రం బ‌త‌క‌డం చాలా క‌ష్టం.నిద్ర శ‌రీరానికి శ‌క్తిని, ఉల్లాసాన్ని అందిస్తుంది.
మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డేలా చేస్తుంది.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని రెట్టింపు చేస్తుంది.అటువంటి నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల అనేక ఆన‌రోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.ముఖ్యంగా నిద్ర‌ను స్కిప్ చేయ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు.

అదేంటి.నిద్ర‌కు, బ‌రువు సంబంధం ఏంటీ అన్న‌ది డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది.

అక్క‌డికే వ‌స్తున్నా ఆగండి.

Telugu Sleep, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్

స‌రిగ్గా నిద్ర‌పోకుండా ఉండ‌డం వ‌ల్ల‌.ఆకలి పుట్టించే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుద‌ల అవుతుంది.అలాగే కడుపు నిండిందనే భావన కలిగించే లెప్టిన్ అనే హార్మోన్ చాలా తక్కువగా ఉత్ప‌త్తి అవుతుంది.

దాంతో మీకు తెలియ‌కుండానే ఎక్కువ ఆహారాన్ని లాగించేస్తారు.ఫ‌లితంగా బ‌రువు పెరుగుతారు.

ఇలా కేవ‌లం పెద్ద వారిలోనే కాదు.చిన్న పిల్ల‌ల్లో కూడా జ‌రుగుతుంది.

అలాగే స‌రిగ్గా నిద్రపోకుండా వేరే వేరే ప‌నుల్లో బిజీ అయితే గ‌నుక‌.మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు, మెద‌డు ప‌ని తీరు మంద‌గించ‌డం, అధిక ఒత్తిడి, తెలియ‌ని ఆందోళ‌న‌, ఇమ్యూనిటీ ప‌వ‌ర్ త‌గ్గిపోవ‌డం, త‌ల‌నొప్పి, చ‌ర్మ కాంతి త‌గ్గిపోవ‌డం, జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గ‌డం, లైంగిక వాంఛ లోపించ‌డం, ఆల‌స‌ట ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు చుట్టేస్తాయి.

కాబ‌ట్టి, ఎప్పుడూ నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కండి.క‌నీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు ఖ‌చ్చితంగా నిద్రించండి.ఆరోగ్యంగా ఉండండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube